Chiranjeevi: మెగాస్టార్ మాస్టర్ ప్లాన్... చిరంజీవి రంగంలోకి దిగడంతో మారిన సీన్!
Tollywood Strike News: మెగాస్టార్ చిరంజీవి పెద్ద చిన్న అని తేడాలు చూపలేదు. నిర్మాతలు అందరినీ కలిశారు. ఫెడరేషన్ నాయకులు, కార్మికులను కలుస్తున్నారు. పరిష్కారం కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటున్నారు. అవసరం వచ్చినప్పుడు ఓ అడుగు ముందుకు వేసి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు - ఫెడరేషన్ సమస్యను పరిష్కరించడానికి మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
చిరును కలిసిన నిర్మాతలు, నాయకులు!
ఇండస్ట్రీ వ్యక్తులను కలవడంలో చిరంజీవి చిన్న పెద్ద తేడాలు చూపడం లేదు. తన ఇంటికి వచ్చిన టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ పెద్దలతో పాటు చిన్న నిర్మాతలను సైతం కలిసి వాళ్ళ సాధక బాధకాలు విన్నారు. తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులను సైతం ఇంటికి పిలిపించుకుని కలిశారు. వాళ్ళ సమస్యలు విన్నారు.
తెలుగు చిత్రసీమలో గత పదిహేను రోజులుగా చిత్రీకరణలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని కార్మికులు సమ్మెకు దిగారు. ఆ తర్వాత నిర్మాతలు - నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. దాంతో చిరంజీవి రంగంలోకి దిగారు. సమస్య పరిష్కరించడానికి పెద్దన్న పాత్ర పోషించడం మొదలు పెట్టారు.
24 శాఖల ప్రతినిధులతో చిరంజీవి చర్చలు!
నిర్మాతలతో పాటు ఫెడరేషన్ నాయకులను కలిసిన చిరంజీవి... అతి త్వరలో 24 శాఖలకు చెందిన ప్రతినిధులతో పాటు కొంత మంది కార్మికులను సైతం కలిసే ఏర్పాట్లలో ఉన్నారు. సుమారు 70 మందిని కలిసి వాళ్ళ సమస్యలను వినడానికి సిద్ధం అయ్యారు. అటు నిర్మాతలు, ఇటు కార్మికులు... ఇరు వర్గాల సమస్యలు వినడంతో పాటు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం కోసం చిరు కృషి చేస్తున్నారు.
Also Read: నాలుగు రోజుల్లో 400 కోట్లు... వీకెండ్ తర్వాత నిలబడిందా? ఇండియాలో రజనీ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపకుండా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు చిరంజీవి. అవసరమైతే మరోసారి నిర్మాతలు, కార్మికులను కలిసే ఏర్పాట్లలో ఆయన ఉన్నారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆయన చూపిస్తున్న చొరవ పట్ల పలువురు సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్ బరిలో షాక్





















