Chiranjeevi: చిరంజీవి వైరల్ వీడియోపై సందేహాలు - అక్కడ జరిగింది వేరు, చూపించింది వేరా?
Chiranjeevi Push Fan: సెల్ఫీ అడిగిన అభిమానులను చిరంజీవి పక్కకు తోసేశారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, చిరు అలాంటివారు కాదని, కావాలనే ఆ వీడియోను ఎడిట్ చేశారని అభిమానులు ఉంటున్నారు.
Chiranjeevi Pushes Fan While Taking Selfie: 'పద్మవిభూషణ్' మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో అభిమాని పట్ల ఆయన వ్యవహరించిన తీరు చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఇంతకీ అక్కడ ఎం జరిగిందంటే.. మెగాస్టార్ చిరంజీవి గతవారం కుటుంబ సమేతంగా పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకల్లో భాగంగా ఆయన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకారతో కలిసి పారిస్ వెకేషన్‌కు వెళ్లారు. అంతేకాదు అక్కడ ఒలింపిక్స్ వేడుకల్లో సందడి చేశారు. భార్యతో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొట్టారు.
అంతేకాదు ఈ ఈవెంట్ ప్రారంభోత్సవంలో ఒలింపిక్ జ్యోతి పట్టుకున్న ఫోటోల షేర్ చేశారు. ఈ క్రమంలో ఆయన తిరిగి భారత్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో నేడు హైదరబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడ నడుచుకుంటూ వెళుతుండగా ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. చిరు ముందుకు నుంచి నడుచుకుంటూ వెళుతూ ఆయన ఎదురుగా నిలబడి సిబ్బంది సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరంజీవి ఆ అభిమాని పక్కకు జరిపి ముందుకెళ్లారు. అయితే, ఈ వీడియోను అక్కడితో ఆపేశారు.
అసలు చిరంజీవి అతడిని పక్కకు నెట్టడానికి కారణం తెలియాలంటే పూర్తి వీడియోను చూడాలి. వీడియోను పరిశీలిస్తే.. చిరంజీవి ఎవరికో దారి ఇవ్వాలనే ఉద్దేశంతోనే అడ్డంగా నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిని పక్కకు జరిపినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ కింది వీడియోను చూస్తుంటే కావాలనే చిరును టార్గెట్ చేసుకుని వీడియోను ఎడిట్ చేసినట్లుగా అనిపిస్తోంది. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు సైతం ఇదే విషయాన్ని తెలుపుతున్నారు. పూర్తి వీడియోను చూడకుండా ఎలా జడ్జ్ చేస్తారంటూ మండిపడుతున్నారు. చిరంజీవి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందేనని, ఆయన అలా దురుసుగా ప్రవర్తించే వ్యక్తి కాదని అంటున్నారు.
Chiranjeevi Rude Behaviour with Fans Airport @KChiruTweets
— South Digital Media (@SDM_official1) July 30, 2024
మీరు పెద్ద హీరో కావొచ్చు కానీ సామాన్య జనం మీ సినిమాలు చూస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని మరిచిపోతే ఎలా గురువు గారు..#Chiranjeevi @IndiGo6E pic.twitter.com/plozmtrw6t
ఇటీవల ఇలాంటి పరిస్థితే నాగార్జునకు ఎదురైంది. ఆయన ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వస్తుండగా.. పక్కనే ఉన్న ఓ ముసలి వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా ఆయన బాడిగార్డు పక్కకు నెట్టారు. ఈ ఘటన నాగార్జున దృష్టికి వెళ్లగానే ఆయన స్పందిస్తూ సారీ చెప్పారు. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ సోషియో ఫాంటసిగా రూపొందుతోంది. చిరు కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ. ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.
Also Read: రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే - ఆయన ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?