Chiranjeevi Anushka : చిరంజీవి సినిమాలో కథానాయికగా అనుష్క?
మెగాస్టార్ చిరంజీవి, అగ్ర కథానాయిక అనుష్క జంటగా నటించనున్నారా? అంటే 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.
తెలుగు చిత్రసీమలో దాదాపు అగ్ర కథానాయకుల అందరితో అనుష్క (Anushka Shetty) నటించారు. స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్ దగ్గుబాటి... ముగ్గురితోనూ ఆమె సినిమాలు చేశారు. ఆ తర్వాత తరం హీరోలలో ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్ తదితరులతో కూడా నటించారు. అయితే... మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సరసన మాత్రం అనుష్క సినిమాలు చేయలేదు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో 'స్టాలిన్' సినిమాలోని ఓ పాటలో అనుష్క ప్రత్యేక గీతం చేశారంతే! సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అనుష్క జంటగా సినిమా ప్రకటించారు కానీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం... మెగా హీరోతో అనుష్క సినిమా చేయబోతున్నారట!
చిరంజీవికి జోడీగా అనుష్క!?
చిరంజీవి కొత్త సినిమాలో అనుష్క జంటగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే... ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, ఏ విషయం త్వరలో తెలుస్తుందని సమాచారం. దాదాపుగా వీళ్ళ జోడీ వెండితెరపై సందడి చేయడం ఖాయమని చెబుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి... 'బింబిసార'తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ జానర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. రెండు... కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నటించే సినిమా. వీటిలో వశిష్ఠ సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా కోసం అనుష్కను సంప్రదించారట.
చిరంజీవి కుటుంబం, అనుష్క మధ్య మంచి అనుబంధం ఉంది. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో ఆమె అతిథి పాత్ర చేశారు. పైగా, చిరంజీవి - వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నది యువి క్రియేషన్స్ సంస్థ! ఆ నిర్మాణ సంస్థలో అనుష్క మూడు చిత్రాలు చేశారు. ఓ విధంగా ఆమె హోమ్ బ్యానర్ వంటిది. అందువల్ల, ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
Also Read : వాయిదాలు లేవమ్మా - దసరా బరిలో బాలయ్య సినిమా!
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో ఇటీవల అనుష్క శెట్టి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సుమారు ఐదేళ్ళ విరామం తర్వాత థియేటర్లలో ఆమె సందడి చేసిన చిత్రమది. అనుష్క నటన, ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో భావోద్వేగభరిత అభినయం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' తర్వాత అనుష్క మరో సినిమా అంగీకరించలేదు. కొత్త కథలు వింటున్నారు. సంథింగ్ స్పెషల్ అనిపిస్తే తప్ప ఓకే చెప్పడం లేదు. వశిష్ఠ దర్శకత్వం వహించబోయేది సోషియో ఫాంటసీ జానర్ సినిమా. కథతో పాటు బలమైన క్యారెక్టర్లు ఉంటాయి. సో... అనుష్క 'ఎస్' చెప్పవచ్చు.
Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial