అన్వేషించండి

Revanth Bhimala - Veda Agarwal: చిచ్చర పిడుగులు... స్టార్ హీరోల సినిమాల్లో వాళ్ళూ హైలైట్ - ఒకప్పుడు మహేష్, ఎన్టీఆర్ కూడా ఇంతేగా!

స్టార్ హీరోలతో పాటు చైల్డ్ ఆర్టిస్టుల రోల్స్ కూడా విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల్లో చిన్నారులు ఇద్దరు హైలైట్ అయ్యారు. మరి అంతకు ముందు ఎవరున్నారు? ఓ లుక్ వేయండి

భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్.. ఈ పేరు చెబితే ఎవరో తెలియకపోవచ్చు గానీ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో 'బుల్లి రాజు' అంటే వెంటనే తెలియకుండానే పెదాలపై నవ్వొచ్చేస్తుంది. సినిమాలో తన తండ్రి వెంకటేష్ (Venkatesh)ను ఎవరైనా ఏదైనా అంటే విపరీతమైన బీపీతో రెచ్చిపోయే అల్లరి పిడగుగా ఆ పిల్లాడి నటన సినిమా ఫస్ట్ అఫ్ ని నిలబెట్టింది అంటే ఏమాత్రం తప్పులేదు. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ను ఇతర పాత్రలను సైతం డామినేట్ చేస్తూ  సుభాష్ చెప్పిన డైలాగులు, ఫేస్ ఎక్స్ప్రెషన్లు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించాయి. ఈ మధ్యకాలంలో  మాస్టర్ భరత్ తర్వాత టాలీవుడ్ కి దొరికిన  మంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా సుభాష్ పేర్ మార్మోగిపోతుంది.

టాలీవుడ్‌లో కీలక పాత్రల్లో చైల్డ్ ఆర్టిస్టులు
ఒక సుభాష్ అనే కాదు... మరో సంక్రాంతి సినిమా 'డాకు మహారాజ్'లోనూ వైష్ణవి క్యారెక్టర్‌లో వేద అగర్వాల్ అనే పాప అదరగొట్టేసింది. నిజానికి సినిమా ఆ పాప చుట్టూనే తిరుగుతుంది. ఇలా సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుల పాత్రలు హైలైట్ అయ్యాయి. అయితే నిజానికి ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు.

చైల్డ్ ఆర్టిస్టుల చుట్టూనే కొత్త కథలు
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి పాత్రలు దక్కేవి. కొన్ని సింపతి బేస్డ్ క్యారెక్టర్లు అయితే మరికొన్ని పూర్తిగా కామెడీని బేస్ చేసుకుని సాగేవి. ఇలాంటి వాటిలో మాస్టర్ భరత్ 'పంచతంత్రం' మొదలుకొని ఓ 10 ఏళ్ళు ఇండస్ట్రీని ఏలేసాడు. తర్వాత ఆ తరహా కథలు తగ్గాయి. కానీ గత కొన్నేళ్లుగా మళ్లీ ఈ ట్రెండ్ మొదలైంది. అనిల్ రావిపూడి 'సుప్రీమ్', గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ', శౌర్యువ్ 'హాయ్ నాన్న', గోపీచంద్ మలినేని 'క్రాక్', 'వీర సింహారెడ్డి' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు హైలైట్ అయ్యారు. మాస్ యాక్షన్ సినిమాలు తీసే బోయపాటి సైతం 'అఖండ'లో చిన్న పాప పాత్రకు  చాలా ప్రాధాన్యత ఇచ్చారు.

మహేష్, ఎన్టీఆర్... అప్పట్లో బాల హీరోలే
చైల్డ్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమాల ట్రెండ్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. పాత సినిమాల విషయం పక్కన పెట్టేస్తే... మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, తరుణ్, సింబు, బాలాదిత్య, 'అల్లరి' నరేష్, రాశి, బేబీ షామిలి, షాలిని లాంటి వాళ్లు చైల్డ్ ఆర్టిస్టులుగా మెరిసి తర్వాత స్టార్ స్టేటస్ పొందిన వాళ్ళే. వీళ్ళలో ఒకరిద్దరు ఒకటి రెండు సినిమాలకు పరిమితమైతే... మహేష్ బాబు, తరుణ్ లాంటి వాళ్లు చైల్డ్ ఆర్టిస్టులుగానే ఆల్మోస్ట్ హీరోలుగా నటించారు. తర్వాత కాలంలో ఎస్వి కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్టులకు మంచి పాత్రలే పడేవి. గుణశేఖర్ అయితే ఏకంగా పిల్లలతోటే 'బాల రామాయణం' తీసి హిట్ కొట్టారు. కానీ తర్వాత కాలంలో ట్రెండు మారిపోవడం, చైల్డ్ ఆర్టిస్టులతో ముదర మాటలు చెప్పించడం వంటివి మొదలు కావడంతో ప్రేక్షకులు పెద్దగా వాటిపై ఇంట్రెస్ట్ చూపించడం నెమ్మదిగా తగ్గించేసారు.

Also Read: డేంజర్ జోన్‌లో పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్... మూడేళ్ళ గ్యాప్, చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు, ఎందుకిలా?

ఇప్పుడు వస్తున్న కొత్త తరం దర్శకులు  తమ కథల్లో చైల్డ్ ఆర్థిస్టులకి సరైన ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వాటిలో నటించిన పిల్లలు హైలెట్ అవుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకు మహారాజ్' సినిమాల్లోని చైల్డ్ పాత్రలు హైలెట్ అయ్యాయంటే వాటిని కథలో ఇమిడ్చిన విధానమే కారణం. దానికి తగ్గట్టే ఆ పిల్లలు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో సంక్రాంతి సినిమాల ప్రేక్షకులు వారి గురించే మాట్లాడుకుంటున్నారు.

Also Read'గేమ్ చేంజర్'ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ... సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget