RC16: మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ - రెహమాన్‌తో బుచ్చిబాబు, రత్నవేలు, శరవేగంగా RC16 ప్రీప్రోడక్షన్ వర్క్..
రామ్ చరణ్ RC16 నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్టు డైరెక్టర్ బుచ్చిబాబు సానా హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఏఆర్ రెహమాన్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

Buchi Babu Starts RC 16 Pre Production Work: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. ఇక చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ఆలస్యంగా అయ్యింది. ఇటవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆర్‌సీ 16(RC16)కు సిద్ధమవుతుంది. దీంతో బుచ్చిబాబు అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో పడింది. ఇందుకు తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్‌తో కలిశారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశాడు బుచ్చిబాబు. ఇందులో ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబుతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ఉన్నారు. చూస్తుంటే బుచ్చిబాబు ప్రీ ప్రోడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అప్‌డేట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఫైనల్‌గా రామ్ చరణ్ RC16 షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టే టైం వచ్చేసిందంటూ మెగా ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. RC16 నుంచి ఇటీవల ఓ క్రేజ్ అప్‌డేట్ ఇచ్చంది మూవీ టీం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో నటిస్తున్నారని, ఇందులో ఆయన కీలక పాత్ర పోషించనున్నాడని, ఆ రోల్ చాలా ప్రత్యేకమైనదంటూ మేకర్స్ స్పష్టం చేశారు.
Two of my favourite people 🤍🤍🤍🤗🤗🤗@arrahman Sir @RathnaveluDop Sir pic.twitter.com/qInQW9Hs60
— BuchiBabuSana (@BuchiBabuSana) July 14, 2024
సినిమా టైటిల్ ఇదేనా..
ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలోఉన్నట్టు తెలుస్తోంది. మూవీ ప్రారంభం కంటే ముందు నుంచే ఈ టైటిల్ ప్రచారంలో ఉంది.RC16కి పెద్ది అనే టైటిల్ (RC 16 titled Peddi) కన్ఫర్మ్ చేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని భావించారు. అయితే..పాన్ ఇండియా మూవీ అదీ కూడా గ్లోబల్ రేంజ్ ఉన్న చరణ్ సినిమాకు ఇలాంటి టైటిల్ ఎంటని కొందరి నుంచి అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఈ టైటిల్‌ను మార్చే ఆలోచన మూవీ టీం ఉన్నట్టు వార్తలు వినిపించాయి.. కానీ బుచ్చిబాబు మాత్రం పెద్ది టైటిల్‌కే ఫిక్స్ అయినట్టు టాక్. మరి 'ఆర్‌సీ 16'కి ఎలాంటి టైటిల్ అనౌన్స్‌చేస్తారో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
గేమ్ ఛేంజర్‌తో బిజీ
రామ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకా మూవీ 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, శంకర్ 'ఇండియన్ 2' ప్రమోషన్‌లో వెల్లడించాడు. కాబట్టి చరణ్ మరికొన్ని రోజులు గేమ్ ఛేంజర్ మూవీతోనే బిజీగా ఉండనున్నాడు. మూవీ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్, ప్రమోషన్స్ ఇలా మూవీ రిలీజ్ డేట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వరకు రామ్ చరణ్ బిజీ బిజీనే. మరి ఈ షెడ్యూల్లో చరణ్ RC16 షూటింగ్ మొదలు పెడతాడా? లేదా? చూడాలి.
Also Read: 'కల్కి 2898 ఏడీ' సక్సెస్‌పై స్పందించిన ప్రభాస్ - సెకండ్ పార్ట్‌పై ఆసక్తికర కామెంట్స్, ఏమన్నాడంటే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

