అన్వేషించండి

Brahma Anandam: పంచకట్టులో స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న కామెడీ బ్రహ్మ - 'బ్రహ్మ ఆనందం' నుంచి ఫస్టలుక్‌ రిలీజ్‌

Brahma Anandam First Look: బ్రహ్మ నందం సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. పంచకట్టులో కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న ఆయన లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది. 

Brahmanandam First Look: 'కామెడీ బ్రహ్మ' బ్రహ్మానందం (Brahmanandam) ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించారు. సంవత్సరానికి పది సినిమాలు చేసే ఆయన ఇప్పుడు చాలా అరుదుగా సినిమాలు సెలక్ట్‌ చేసుకుంటున్నారు. వయసు రిత్యా ఆయన మెల్లిగా నటనకు బ్రేక్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన లాక్‌డౌన్‌ తర్వాత నుంచి ఆడపదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అది కూడా ఆయను నచ్చితేనే. ప్రస్తుతం ఆయన చిన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

తన పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒకే చేసి అప్పుడప్పుడు వెండితెరపై ప్రేక్షకులను నవ్విస్తున్నారు. చివరిగా కలర్స్‌ స్వాతి 'పంచతంత్రం'సినిమాలో కనిపించిన ఆయన ప్రస్తుతం 'బ్రహ్మా ఆనందం' (Brahma Anandam Movie) అనే మూవీలో నటిస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ప్రధాన పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో బ్రహ్మానందం పంచకట్టులో కళ్లద్దాలు పెట్టుకుని హుందాగా కనిపించారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raja Goutham (@rajagoutham)

కాగా కొత్త దర్శకుడు RVS నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుందట. ఇక ఇందులో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్‌కు తాతగా నటిస్తున్నట్టు ఇప్పటికే మూవీ వెల్లడించింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌లుహ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిజజీవితంలో తండ్రి కొడుకులు ఇప్పుడు ఈ సినిమాలో తాత మనవడి నటించడం మూవీపై అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: 'దేవర'లో విలన్ భైరా గ్లింప్స్ వచ్చేసింది... రెండు లుక్కుల్లో సైఫ్ అలీ ఖాన్!

పల్లకిలో పెళ్లి కూతురు, బసంతి వంటి చిత్రాలతో ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు రాజా గౌతమ్‌. కానీ అతడికి ఆశించిన విజయం, గుర్తింపు రాలేదు. దీంతో ఇక సినిమాలకు బ్రేక్‌ తీసుకున్నాడు. ఇక పూర్తి నటనకు గుడ్‌ బై చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజా గౌతమ్‌ హీరో 'బ్రహ్మ ఆనందం' సిసినిమా ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇది ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మూవీ ప్రకటించిందని తెలుస్తోంది. 

Also Read: నేషనల్ అవార్ట్స్‌ - ఉత్తమ నటిగా నిత్యామీనన్‌, మానసి పరేఖ్‌లకు అవార్డు, ఏ సినిమాలకంటే..

టాప్ హెడ్ లైన్స్

Madhuri Rathod Reaction : నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్
నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్
Chiranjeevi : చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget