అన్వేషించండి

Saif Ali Khan: 'దేవర'లో విలన్ భైరా గ్లింప్స్ వచ్చేసింది... రెండు లుక్కుల్లో సైఫ్ అలీ ఖాన్!

Saif Ali Khan Glimpse Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాలో గ్లింప్స్ విడుదల చేశారు.

Saif Ali Khan Look As Bhaira In Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్. ఆ విషయం ఎన్టీఆర్ అభిమానులకూ, ప్రేక్షకులకూ తెలుసు. అయితే... ఆయన లుక్ ఎలా ఉంటుందో తెలుసా?

సైఫ్ పుట్టినరోజు... రెండు లుక్కులో వచ్చాడు!
Saif Ali Khan Birthday: ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే. ఈ సందర్భంగా 'దేవర' మూవీ టీమ్ ఆయనకు విషెష్ చెప్పింది. అంతే కాదు... పుట్టినరోజు బహుమతిగా  గ్లింప్స్ విడుదల చేసింది. గ్లింప్స్ ద్వారా ఓ క్లారిటీ కూడా వచ్చింది. అది ఏమిటంటే... ఇందులో సైఫ్ అలీ ఖాన్ రెండు లుక్కుల్లో కనిపించారు. ఒక లుక్ మిడిల్ ఏజ్డ్ అయితే, మరొకటి యంగ్. పొడవాటి జుట్టుతో, షార్ట్ హెయిర్ కట్‌తో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు.

Saif Ali Khan Role In Devara: 'దేవర' సినిమాలో భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారని యూనిట్ పేర్కొంది. బర్త్ డే గ్లింప్స్ చూస్తే... తొలుత ఆయుధ పూజ చూపించారు. రకరకాల కత్తులు కనిపించాయి. ప్రజలు అంతా కలిసి తమ దైవానికి మొక్కడం కనిపించింది. ఆ తర్వాత భైరాను చూపించారు. ఓ ఆలయంలో 'భైరా... భైరా' అంటూ ప్రజలు కొట్టే జేజేల నడుమ సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఆయన వేటాడితే తరతరాలు చెప్పుకొనేలా ఉంటుందనే విధంగా ఓ కొటేషన్ ఇచ్చారు.

Also Read: 2024 ఇయర్ ఎండ్‌లో మళ్ళీ నేషనల్ అవార్డ్స్ - నాలుగు నెలల్లో ఇంకోసారి ఎందుకు ఇస్తున్నారంటే?

ఇసుకను ప్రత్యర్థుల రక్తంతో తడిపిన భైరా!
దేవర హీరో గ్లింప్స్ గుర్తు ఉంది కదా... 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తురుని ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు' అని ఎన్టీఆర్ డైలాగ్ చెబుతారు. అక్కడ నీటిలో నెత్తురు కనిపించింది. సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే గ్లింప్స్‌లో కూడా నెత్తురు ఉంది. అయితే... అది నెల మీద కనిపించింది. భైరా ధాటికి మట్టి కుస్తీలో ప్రత్యర్థుల రక్తం నేల మీద చిందినట్టు అర్థం అవుతోంది.


Devara Movie Cast And Crew: 'దేవర' సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయిక. ఎన్టీఆర్ జోడీగా ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. అలాగే, తెలుగులోనూ ఆమెకు ఇదే తొలి సినిమా. సైఫ్ అలీ ఖాన్ కాకుండా బాబీ డియోల్ మరొక విలన్ రోల్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 27న సినిమా విడుదల అవుతుంది. ఎన్టీఆర్ అన్నయ్య, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: స్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

MS Subbulakshmi Biopic : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Dhanush : ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
Sai Durgha Tej New Movie : తేజ కాకుమానుతో సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ విత్ క్రేజీ టైటిల్
తేజ కాకుమానుతో సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ విత్ క్రేజీ టైటిల్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget