Arjun Ambati: అర్జున్ అంబటి సినిమాలో రొమాంటిక్ ఐటమ్ సాంగ్... గీతా మాధురి పాడిన 'బూమ్ బూమ్' లిరికల్ వీడియో చూశారా?
Paramapada Sopanam Movie: అర్జున్ అంబటి కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'పరమపద సోపానం'. ఇందులో రెండో పాట 'బూమ్ బూమ్'ను తాజాగా విడుదల చేశారు.

Arjun Ambati latest movie: బుల్లితెరపై సీరియళ్లు, రియాలిటీ షోలతో పాటు వెండి తెరపై సినిమాల్లోనూ తన మార్క్ చూపించిన నటుడు అర్జున్ అంబటి. 'అర్ధనారి' హీరోగా, నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత 'తెప్ప సముద్రం', 'వెడ్డింగ్ డైరీస్' సినిమాల్లో నటించారు. 'బిగ్ బాస్'తో మరింత పాపులర్ అయ్యారు.
అర్జున్ అంబటి హీరోగా నటించిన తాజా సినిమా 'పరమపద సోపానం'. ఇందులో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకుడు. ఎస్ఎస్ మీడియా పతాకం మీద గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది.
బూమ్ బూమ్... రొమాంటిక్ ఐటమ్ సాంగ్!
జూలై 11న 'పరమపద సోపానం' విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 'చిన్ని చిన్ని తప్పులేవో' లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడు 'బూమ్ బూమ్' అంటూ సాగే రొమాంటిక్ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ''పూరి జగన్నాథ్ గారి దగ్గర నాగ శివ గారు చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారి 'పరమపద సోపానం'తో వస్తున్నారు. ఈ పాట అందర్నీ అలరిస్తుంది'' అని చెప్పారు. ఈ పాటకు రాంబాబు గోశాల సాహిత్యం అందించగా... డేవ్ జాండ్ మ్యూజిక్ అందించారు.
అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'పరమపద సోపానం' సినిమాకు దర్శకత్వం: నాగ శివ, నిర్మాత: గుడిమిట్ల శివప్రసాద్, సహ నిర్మాత: గుడిమిట్ల ఈశ్వర్, నిర్మాణ సంస్థ: ఎస్ఎస్ మీడియా, సంగీతం: డేవ్ జాండ్, కెమెరా: ఈశ్వర్.





















