By: ABP Desam | Updated at : 29 May 2023 03:34 PM (IST)
Photo Credit: Malaika Arora/Instagram
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నటిగా, మోడల్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ షోలతో, పాటు ఓటీటీలోనూ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే మలైకా అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని విడిపోయింది. కొంతకాలం వీరి సంసార జీవితం బాగానే కొనసాగినా, ఆ తర్వాత వివాదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపిన మలైకా, తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం అతడితో డేటింగ్ కొనసాగిస్తోంది. ఇద్దరూ కలిసి సరదా సరదాగా గడుపుతూ నిత్యం మీడియాకు కనిపిస్తూనే ఉన్నారు. పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా మలైకా అరోరా చేసిన పనికి పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంతకీ ఏం జరగిందంటే? తాజాగా మలైకా తన బాయ్ ఫ్రెండ్ సెమీ న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, ‘నా లేజీ బాయ్’ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫోటోలో అర్జున్ ఒంటిపై కేవలం ఒక చిన్న దిండు మాత్రమే కనిపిస్తోంది. ఈ ఫోటో ఆల్మోస్ట్ న్యూడ్ గానే కనిపిస్తోంది.
మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రేమకు వయసుతో పని లేదు. నీ జీవితం నీ ఇష్టం. కానీ, ఓ టీనేజ్ పిల్లాడికి తల్లివై ఉండి సోషల్ మీడియాలో ఇలాగేనా ప్రవర్తించేది? నువ్విలా విచ్చల విడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి తలెత్తుకుని ఎలా తిరగగలడు? ఎంత మంది అతడిని ప్రశ్నలతో గుచ్చి గుచ్చి చంపుతారు. నువ్వు చేసే పనుల వల్ల అతను నవ్వుల పాలు కావాల్సి వస్తోంది. నీ బెడ్ రూం విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేంటి? హద్దులు మీరుతూ ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త” అంటూ ఫైర్ అవుతున్నారు. నెటిజన్ల కామెంట్స్ పై అర్జున్ స్పందించారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదని హితవు పలికాడు.
అటు మలైకా, అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె పెళ్లి గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. త్వరలో అర్జున్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరించింది. “నేను వెనుక సీటులో కూర్చోవాలి అనుకోవడం లేదు. నేను తనతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటున్నాను. అర్జున్‌తో ఒక ఇంటిని సెటప్ చేయాలనుకుంటున్నాను. మా సంబంధాన్ని కీలక స్థాయికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను. మేమిద్దరం దానికి సిద్ధంగా ఉన్నామని నేను భావిస్తున్నాను” అని వెల్లడించింది.
Read Also: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?
మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటుంది. తెలుగులో ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ఆమె ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ షోతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అటు అర్జున్ కపూర్ ‘లేడీ కిల్లర్’ చిత్రంలో నటిస్తున్నాడు.
Read Also: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
Siddharth: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్‌కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్
'హాయ్ నాన్న' నుంచి సెకండ్ సింగిల్ - 'గాజు బొమ్మ' సాంగ్ ఎప్పుడంటే?
నా లైఫ్ నా ఇష్టం, వాటిని అస్సలు పట్టించుకోను - హృతిక్ రోషన్‌తో డేటింగ్‌పై సబా ఆజాద్ కామెంట్స్!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
/body>