Sonam Kapoor : రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
Sonam Kapoor : బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పలువురు ప్రముఖులు విషెష్ తెలిపారు.

Bollywood Actress Sonam Kapoor Blessed With Baby Boy : బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లయ్యారు. నాలుగు పదుల వయసులో ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఆదివారం (మార్చి 29) తమకు బాబు పట్టాడని... ఈ విషయాన్ని ప్రకటించేందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నాడు. రెండోసారి కూడా మగ బిడ్డకే జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
నలుగురితో కొత్త అధ్యాయం
'అపారమైన కృతజ్ఞత, ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29, 2026న మా బాబు రాకను సంతోషంగా ప్రకటిస్తున్నాం. మా ఫ్యామిలీ పెద్దదైంది. చిన్నారి రాకతో మా హృదయాలు ఎంతో అందంగా విశాలమయ్యాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఉప్పొంగిపోతున్నాడు. ఈ కొత్త వ్యక్తితో మా ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ప్రేమతో సోనమ్, ఆనంద్, వాయు.' అంటూ రాసుకొచ్చారు.
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాను 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరికి వాయు అనే బాబు పుట్టాడు. ఇప్పుడు రెండో మగబిడ్డకు జన్మనిచ్చారు. సినిమాల విషయానికొస్తే... సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'సావరియా' మూవీతో సోనమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యారు. బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ్ రతన్ ధన్‌పాయో, సంజు, నీర్జా, రాంఝన, ఖుబ్సూరత్ మూవీస్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈమె ఒకరు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు






















