అన్వేషించండి

Parineeti Chopra Wedding: ఆప్ ఎంపీతో ఘనంగా పరిణీతి చోప్రా పెళ్లి, ఆమె అక్క ప్రియాంక చోప్రా ఎందుకు రాలేదు?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్, నటి పరిణీతి చోప్రా పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది. సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో వీరి కోసం ప్రత్యేకమైన విడిది ఏర్పాట్లు చేశారు.

ప్రియాంక చోప్రా గైర్హాజరు

పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి తప్పకుండా పెళ్లికి హాజరవుతుందని అంతా భావించారు. అయితే, ఆమె చివరి క్షణంలో హ్యాండిచ్చింది. పెళ్లికి రాలేనని ముందుగానే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హింట్ ఇచ్చింది. ‘‘మై డియర్ కజిన్.. నీకు నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది’’ అని పేర్కొంది. సెప్టెంబరు 23న జరిగిన సంగీత్‌కు కూడా ప్రియాంక హాజరు కాలేదు. పెళ్లిలో కూడా ఆమె కనిపించలేదు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన జైఉల్ఫ్ కాన్సెర్ట్‌లో పాల్గోవడం కోసమే ప్రియాంక చోప్రా.. పరిణీతి పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంక.. ఆ కాన్సర్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో చెల్లి పెళ్లి కంటే ఆ కన్సెర్ట్ అంత ముఖ్యమైనదా అని అంటున్నారు. 

ఢిల్లీ సీఎం, సానియా మిర్జా, హర్భజన్ సింగ్ హాజరు

ఈ పెళ్లికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ కూడా హాజరయ్యారు. టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్య థాకరే తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ప్రత్యేకమైన బోటులో ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఈ పెళ్లిలో పరిణీత.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర రూపొందించిన పెళ్లి దుస్తులు ధరించింది. ఈ నెల 30 చండీగడ్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

పరిణీతి చోప్రా సుమారు 12 ఏళ్లుగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. 2011లో రణవీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘లేడీస్ vs రికీ బహ్ల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2012లో వచ్చిన ‘ఇష్క్‌జాదే’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్లతో ఆశ్చర్యపరిచింది. ‘సుద్ దేశీ రొమాన్స్’ మూవీలోనూ ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అయితే, పరిణీతి తన కెరీర్‌లో ఒక్క దక్షిణాది సినిమా కూడా చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం పరిణీతి చోప్రా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘మిషన్ రాణిగంజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. 1989 రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ డిజాస్టర్ సమయంలో 65 మంది మైనర్లను రక్షించిన ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అటు  ఇంతియాజ్ అలీ  జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘చమ్కిలా’లో కూడా  ఆమె కనిపించనుంది.  ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.

Also Read:  సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget