Kajol Devgan: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌కు షాక్ - పూజా మండపం వద్ద అనుచితంగా తాకిన వ్యక్తి... వైరల్ వీడియో
Kajol: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దుర్గా పూజకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకినట్లు ఉండగా... ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Bollywood Actress Kajol Devgan In Dugra Puja Mandapam Video Viral: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవగన్‌కు దుర్గా పూజా మండపంలో అవమానం జరిగినట్లుగా ఉన్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా కాజోల్ దుర్గా పూజలో పాల్గొన్నారు. పండల్ వద్ద ఆమె పూజలో పాల్గొని మెట్లు దిగి వస్తుండగా అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లుగా ఆ వీడియోలో ఉంది. దీంతో కాజోల్ సదరు వ్యక్తిని ఆగ్రహంతో చూశారు. ఆ తర్వాత ఆమె పైకి వెళ్లారు.
తెల్లటి చీర నుదిట సింధూరంతో కాజోల్ అమ్మవారి పూజ చేసుకుని కిందకు వస్తుండగా... సదరు వ్యక్తి అనుచితంగా తాకినట్లుగా ఉంది. ఈ వీడియోను 'ఇన్ స్టట్ బాలీవుడ్' షేర్ చేస్తూ... 'భద్రతా బృందం ఆమెను ఆపినప్పుడు కాజోల్ షాక్ అయ్యారు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
నెటిజన్స్, ఫ్యాన్స్ ఆగ్రహం
ఈ వీడియోను చూసిన కాజోల్ ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'హీరోయిన్‌ను సదరు వ్యక్తి అనుచితంగా తాకాడని... ఇది సరి కాదు.' అంటూ కామెంట్ చేశారు. అసలు అతను సెక్యూరిటీ గార్డే కాదని... వెంటనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరొకరు కామెంట్ చేశారు. నోటితో చెప్తే అయిపోయేదని... కానీ ఇలా అనుచితంగా తాకడం కరెక్ట్ కాదంటూ మరికొందరు రియాక్ట్ అయ్యారు. మహిళలపై దురుసు ప్రవర్తన క్షమించరాని నేరమంటూ స్పందిస్తున్నారు.
View this post on Instagram
Also Read: ట్రెండింగ్‌లో 'ది గేమ్' వెబ్ సిరీస్ - డిజిటల్ వరల్డ్‌లో స్కామ్స్... తెలుగులోనూ ఇప్పుడే చూసెయ్యండి






















