Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ - ట్రోలింగ్స్‌తో 24 గంటల్లోనే...
Rahul Ramakrishna Tweets: ఫేమస్ కమెడియన్, హీరో రాహుల్ రామకృష్ణ గురువారం వరుస ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ట్రోలింగ్ సాగడంతో ఆయన అకౌంట్ క్లోజ్ చేసేశారు.

Rahul Ramakrishna Twitter Account Closed: టాలీవుడ్ ఫేమస్ కమెడియన్, హీరో రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశారు. గురువారం ఆయన వరుసగా వివాదాస్పద ట్వీట్స్ చేశారు. హైదరాబాద్ వరదల దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సహా కేటీఆర్, కేసీఆర్‌లకు సపోర్ట్‌గా పోస్టులు పెట్టారు. అలాగే, గాంధీ జయంతి రోజున 'గాంధీ మహాత్ముడు కాదు' అంటూ కాంట్రవర్శీకి తెరలేపారు.
ఈ పోస్టులు పెట్టిన క్షణాల్లోనే వైరల్ కాగా లక్షల్లో వ్యూస్, లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో నెటిజన్లు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ట్రోల్స్ చేశారు. అసలు ఇప్పుడు 'హైదరాబాద్ వరదల గురించి ఎందుకు?', 'రాహుల్ గారు మీకు ఏమైంది?', 'KTR KCRలను ఎందుకు ట్యాగ్ చేశారు?' అంటూ ప్రశ్నలు సంధించారు. ట్రోలింగ్ విపరీతంగా సాగడంతో ఆయన ట్వీట్స్ అన్నీ డిలీట్ చేసి 'X' అకౌంట్ క్లోజ్ చేసేశారు.
Also Read: అప్పుడు జైలర్, ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1... బాలయ్య మార్క్ సెలక్షన్
ఆ పోస్టులు ఏంటంటే?
'అర్జున్ రెడ్డి' మూవీతో ఫుల్ ఫేం సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వరుస మూవీస్‌లో తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా పొలిటికల్, సామాజిక అంశాలపై పోస్టులు పెట్టేవారు. దసరా రోజున ఆయన చేసిన వరుస ట్వీట్స్ చర్చనీయాంశమయ్యాయి.
'మనం చాలా భయంకర కాలంలో జీవిస్తున్నాం. అప్పటివరకూ వేచి ఉండలేను. KTR పరిస్థితులు చక్కదిద్దాలి.' అంటూ ఆయన్ను ట్యాగ్ చేశారు. దీంతో పాటే... 'నాకు ఆశ ఏమీ లేదు. నన్ను చంపేయండి.' అంటూ ముంగించారు. అలాగే మరో పోస్టులో... 'ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు. మనం మానవులమే. ఎప్పుడూ ప్రేమతోనే జీవించాలి.' అంటూ ఓ శాంతి సందేశంతో పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో వరదలను ప్రస్తావిస్తూ... 'హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలన్నీ విఫలమయ్యాయి. @KCRBRSPresident ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రతీ దాన్నీ క్రమబద్దీకరించమని.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే... గాంధీ జయంతి రోజున... 'గాంధీ మహాత్ముడు కాదు' అంటూ కూడా పోస్ట్ చేశారు. అలాగే, బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌లకు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేశారు.
ట్రోలింగ్ మామూలుగా లేదు
దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాహుల్ ఎందుకు ఇప్పుడు వీటిని ప్రస్తావించారు. శాంతి సందేశంతో పాటు ఎప్పుడో వచ్చిన వరదలకు ఇప్పుడు రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి? అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు ఆయనకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇక ట్రోలింగ్ విపరీతంగా సాగుతుండడంతో తన అకౌంట్‌నే క్లోజ్ చేసేశారు రాహుల్. అయితే, గతంలోనూ రాహుల్ పలు అంశాలపై స్పందించారు. పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ పోస్ట్ చేయగా... ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. తన కామెంట్స్ వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పడం అప్పట్లో వైరల్‌గా మారింది.





















