News
News
X

Bimbisara Release Trailer: శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం - అంచనాల సరిహద్దులు చెరిపేస్తూ 'బింబిసార' రిలీజ్ ట్రైలర్

Bimbisara Release Trailer Launched By RRR Actor NTR Jr via Twitter: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'బింబిసార' రిలీజ్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

FOLLOW US: 

నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) టైటిల్ పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ సినిమా 'బింబిసార' (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఆగస్టు 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ ఒక ట్రైలర్ విడుదల చేశారు. ఈ రోజు ట్విట్టర్ ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.

Bimbisara Release Trailer: 'బింబిసార' రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే... వీరోచిత మహారాజు బింబిసారగా కళ్యాణ్ రామ్ ఠీవిని ఎక్కువ చూపించారు.

'హద్దులను చెరిపేస్తూ, మన రాజ్యపు సరిహద్దులు ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి' అని నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ తో రిలీజ్ ట్రైలర్  లో విజువల్స్ మొదలయ్యాయి. 'శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం' అంటూ చెప్పిన డైలాగ్, అక్కడ కళ్యాణ్ రామ్ ఉగ్ర రూపం ఆకట్టుకుంది. మహారాజుగానే కాదు... కళ్యాణ్ రామ్ మోడ్రన్ లుక్ కూడా చూపించారు. 'నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకలంటే... ఈ బింబిసారుడి కత్తిని దాటాలి' అని చెప్పే డైలాగ్ మరో హైలైట్. యాక్షన్ ప్యాక్డ్ రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుందని చెప్పాలి. 

'ఓ సమూహాం తాలూకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే... కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలు అయితే... ఇందరి భయాన్ని చూస్తూ... పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం... బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం' అంటూ ఆల్రెడీ విడుదల చేసిన ట్రైల‌ర్‌లో కల్యాణ్ రామ్ ఆహార్యం, సంభాషణలు హైలైట్ అయ్యాయి.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మించిన 'బింబిసార' ద్వారా వ‌శిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆల్రెడీ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది.

Also  Read : వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు - పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

ఈ సినిమాలో కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్, వరీనా హుస్సేన్ హీరోయిన్లు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.

Also  Read : రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రెడీ!

Published at : 27 Jul 2022 05:08 PM (IST) Tags: Nandamuri Kalyan Ram Samyuktha Menon Catherine Tresa Bimbisara Movie Bimbisara Release Trailer NKR Bimbisara

సంబంధిత కథనాలు

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు

Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

టాప్ స్టోరీస్

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ

Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ