అన్వేషించండి

Bhumika Chawla: యోగిబాబుతో భూమిక మూవీ - ‘స్కూల్’ ఫస్ట్ లుక్ చూశారా?

School Movie: సీనియర్ హీరోయిన్ భూమిక లీడ్ రోల్‌లో నటించి చాలాకాలం అయ్యింది. తాజాగా ‘స్కూల్’ అనే సైకలాజికల్ కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యింది.

School Movie First Look: సీనియర్ హీరోయిన్ భూమిక.. చాలాకాలం తర్వాత సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం ఏడాదికి కనీసం ఒకట్రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తను ఎక్కువగా సినిమాల్లో కీలకంగా ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా అదే తరహాలో మరో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకొని షూటింగ్‌ను ప్రారంభించింది. అదే ‘స్కూల్’. భూమిక లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో యోగి బాబు, కేఎస్ రవికుమార్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అవ్వడంతో పాటు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను కూడా ప్రారంభించారు మేకర్స్.

ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

ఆర్ కే విద్యాధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘స్కూల్’. డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తారని ఇప్పటికే విద్యాధరన్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే తరహాలో ‘స్కూల్’ అనే మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలయిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో ఒక పేజీ కాలిపోతూ ఉంటుంది. కాలిపోతున్న ఆ పేజీపైనే భూమిక, యోగి బాబు, రవికుమార్ ఫోటోలు ఉంటాయి. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్‌గా ‘ఏ డీప్ సైకాలజీ మూవీ’ అని ఉంది. దీన్ని బట్టి చూస్తే మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. 

విద్యార్థుల దృష్టికోణంలో సినిమా..

తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ‘స్కూల్’ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు మేకర్స్. ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథ అని అన్నారు. ఈరోజుల్లో స్కూల్స్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి చెప్తూ.. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం బయట సమాజంలో జరుగుతున్న ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాల పట్ల విద్యార్థుల దృష్టికోణం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తామని మేకర్స్ చెప్తున్నారు. ‘స్కూల్’లో భూమిక, యోగిబాబు.. ఇద్దరూ టీచర్లగానే కనిపించనున్నారు. ఇక కేఎస్ రవికుమార్ ఒక ఇన్వెస్టిగేటివ్ పాత్రను పోషించనున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వెంటనే ‘స్కూల్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది.

కోలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్..

ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా బిజీ కెరీర్‌ను గడిపేస్తున్నాడు యోగి బాబు. కమెడియన్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని కామెడీ చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేస్తుంటాడు. ఇప్పటికే యోగి బాబు లీడ్ రోల్ చేసిన ‘లోకల్ సరక్కు’ అనే చిత్రం జనవరి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. స్టార్ హీరో, యంగ్ హీరో అని తేడా లేకుండా.. అందరు హీరోల సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు యోగిబాబు. ఈ కమెడియన్ ఉంటే సినిమాలో కామోడీ బాగుంటుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయే స్థాయికి చేరుకున్నాడు. ఇక అలాంటి కమెడియన్ ఇప్పుడు ‘స్కూల్’ అనే ఒక డిఫరెంట్ సైకలాజిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read: ‘ఆహా’లో బోల్డ్ ఫిల్మ్ - ఇంట్రెస్టింగ్‌‌గా ఫస్ట్ లుక్

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget