By: ABP Desam | Updated at : 07 Sep 2023 10:27 AM (IST)
Photo Credit : Bhumi Pednekar/Instagram
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'థాంక్యూ ఫర్ కమింగ్'(Thank You For Coming). రైజ్, రెబల్, రిపీట్ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఓ విభిన్న తరహా కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇంటర్ కోర్స్ సమయంలో 90% మగవాళ్ళు అవుట్ అయిపోతారు, కానీ ఆడాళ్లు మాత్రం 50% అంటూ బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇక ట్రైలర్ ని ఒకసారి గమనిస్తే.." ఫెయిరీ టేల్ లో ప్రతి రాజకుమారి కథ ఒకలాగే ఉంటుంది. ఒక కప్ప ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కిస్ చేయగానే అది ప్రిన్స్ లాగా మారతాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నాకు కూడా అలానే అనిపించింది. కానీ నాకు ఎప్పుడూ భావప్రాప్తి ఇవ్వలేదు" అంటూ ఈ ట్రైలర్ సాగింది. ఇక ట్రైలర్లో మహిళల కోణం నుంచి సెక్సువల్ రిలేషన్ షిప్స్ ఎలా ఉంటాయి అనే పాయింట్ ని చూపించారు. భూమి పెడ్నేకర్ శృంగార సన్నివేశాల్లో ఎప్పటిలాగే రెచ్చిపోయి మరి నటించింది. ఓ షాట్ లో అయితే ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చింది. ఇక ట్రైలర్లో అనిల్ కపూర్ సైతం కనిపించి ఆకట్టుకున్నారు. మొత్తంగా ఉమెన్ సెక్సువల్ రిలేషన్ షిప్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.
ఇక బాలీవుడ్ కి ఇలాంటి కంటెంట్ కొత్త కాదు. సెక్సువల్ రిలేషన్స్ పై ఇప్పటికే బాలీవుడ్లో సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి. కాకపోతే 'థాంక్యూ ఫర్ కమింగ్' సినిమా విషయానికొస్తే, శృంగారం చేయకముందు మగాళ్లు త్వరగా తేలిపోతున్నారని, ఆడవాళ్లు వాళ్ళ కంటే కొంచెం బెటర్ అనే పాయింట్ ని అంతే బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వీర్యదానం కాన్సెప్ట్ తో వచ్చిన 'విక్కీ డోనర్', అబ్బాయి అమ్మాయిగా మారి కవ్విస్తే అనే కాన్సెప్ట్ తో వచ్చిన 'డ్రీమ్ గర్ల్' వంటి ప్రయోగాత్మక చిత్రాలు బాలీవుడ్లో సంచలన విజయాలను అందుకున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి.
ఇప్పుడు అదే తరహాలో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో 'థాంక్యూ ఫర్ కమింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్, శోభాకాపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రియా కపూర్ భర్త కరణ్ భులాని ఈ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సినిమాలో భూమి పెడ్నేకర్ తో పాటు షహనాజ్ గిల్, అనిల్ కపూర్, నటాషా రస్తోగి, కుషా కపిల, డాలీ సింగ్, సలోని దైని, డాలీ అహ్లువాలియా, కరణ్ కుంద్రా, సుశాంత్ దిగ్వికర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 6 న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : ఓవర్సీస్‌లో షారుఖ్ క్రేజ్ - ఏకంగా 3,500 స్క్రీన్స్‌లో 'జవాన్' రిలీజ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>