ఓవర్సీస్‌లో షారుఖ్ క్రేజ్ - ఏకంగా 3,500 స్క్రీన్స్‌లో 'జవాన్' రిలీజ్!
షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్' సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేవలం ఓవర్సీస్ లోనే ఈ సినిమా ఏకంగా 3500 థియేటర్స్ లో విడుదల అవుతున్నట్లు సమాచారం.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ - షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'జవాన్' విడుదలకి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ కోసం షారుక్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జవాన్' సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో కచ్చితంగా ఈ మూవీకి ఎవరూ ఊహించిన విధంగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్డ్ గా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ స్కేల్ లో విడుదల కాబోతోంది. షారుక్ ఖాన్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓవర్సీస్ లో 'జవాన్' మూవీ ఏకంగా 3,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. షారుక్ గత చిత్రం 'పఠాన్' కంటే దాదాపు 700కి పైగా ఎక్కువ స్క్రీన్స్ లో 'జవాన్' విడుదల అవుతుండటం విశేషం. ఈ కౌంట్స్ ని బట్టి ఓవర్సీస్ లో 'జవాన్' కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. షారుక్ ఖాన్ కి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ఉండడంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో ఓవర్సీస్ లో షారుక్ ఖాన్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాగా 'జవాన్' సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ లో 'జవాన్' టికెట్స్ కి ఓ రేంజ్ లో డిమాండ్ ఉండడంతో రిలీజ్ రోజు ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఇంటర్నేషనల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఫస్ట్ డే మాత్రమే కాకుండా నాలుగు రోజులకు అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ఇక ఇదే ఊపు కనక కొనసాగితే 'జవాన్' ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ 5 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇక రిలీజ్ తర్వాత సినిమాకి మౌత్ టాక్ బాగుంటే ఫస్ట్ వీకెండ్ నాలుగో రోజుకే 20 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే కేవలం నాలుగు రోజుల్లో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 20 మిలియన్ల డాలర్స్ ని వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా 'జవాన్' నిలవనుంది. ఇక ఓవర్సీస్ లో ఇదే 20 మిలియన్ల డాలర్లను వసూలు చేసేందుకు షారుక్ ఖాన్ గత చిత్రం 'పఠాన్' కి ఐదు రోజులు పట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా 'జవాన్' మూవీ ఏకంగా 5000 పైగా స్క్రీన్స్ లో విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ డబ్బింగ్ వర్షన్స్ కి కూడా ఎక్కువ స్క్రీన్స్ దక్కడం విశేషం. ఫస్ట్ షో నుంచే సినిమాకి పాజిటివ్ వస్తే 'జవాన్' ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక షారుఖ్ ఖాన్ గత చిత్రం 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి సంచలన విజయం అందుకుంది. దీంతో 'జవాన్' సైతం రూ.1000 కోట్లకు పైగా టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. మరి 'పఠాన్' మ్యాజిక్ ని 'జవాన్' రిపీట్ చేస్తుందా? లేదా అనేది చూడాలి.
Also Read : కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విలన్‌గా నటిస్తున్న అనుష్క - ఆ సినిమాలో ఆమె రోల్ అదేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial