Actress Bhumi Pednekar : డెంగ్యూతో ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ - ఎనిమిది రోజులు నరకం
Bhumi Pednekar : బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తాజాగా డెంగ్యూ బారిన పడింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Acctress Bhumi Pednekar : బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) తాజాగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా తను హాస్పిటల్ లో చేరడానికి గల కారణాన్ని కూడా తెలిపింది. ఇంతకీ భూమి పెడ్నేకర్ హాస్పిటల్ లో చేరడానికి గల కారణం ఏంటి?
బాలీవుడ్ లో పలు విభిన్న తరహా చిత్రాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమి పెడ్నేకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా 'లేడీ కిల్లర్' (Lady Killer) అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన భూమి ఇటీవల 'థాంక్యూ ఫర్ కమింగ్' (Thank You For Coming) అనే అడల్ట్ మూవీలో నటించి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా అర్జున్ కపూర్ (Arjun Kapoor) తో జత కట్టింది. అజయ్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 3 విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భూమి పెడ్నేకర్ అనారోగ్యానికి గురైంది. ఈ విషయాన్ని భూమి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది. డెంగ్యూ కారణంగా తాను ఆసుపత్రిలో చేరినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దాంతోపాటు దోమల నివారణ తప్పనిసరి అని కోరింది. అధిక కాలుష్యం కూడా మన అనారోగ్యానికి ఒక కారణమని భూమి పెడ్నేకర్ తెలిపింది.
"ఒక దోమ వల్ల నేను ఎనిమిది రోజులు నరకం అనుభవించా. దాదాపు వారం రోజుల తర్వాత ఉదయాన్నే నిద్ర లేచాను. అందుకే మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉండడం ఎంతో కష్టంగా అనిపించింది. ప్రతి ఒక్కరు దోమలను చంపే వాటిని తప్పకుండా వినియోగించండి. అలాగే మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. అధిక కాలుష్యంతో మన రోగ నిరోధక శక్తి చాలావరకు తగ్గుతోంది. నాకు తెలిసిన చాలామందికి కూడా డెంగ్యూ వచ్చింది. నన్ను బాగా చూసుకున్నందుకు ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు" అని తన ఇన్ స్టా పోస్ట్ లో రాసుకొచ్చింది భూమి పెడ్నేకర్.
దీంతో భూమి షేర్ చేసిన ఫోటోలు వైరల్ రావడంతో అభిమానులతో పాటూ పలువురు నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం భూమి రెడ్నేకర్ 'మేరీ పత్నీ కా రీమేక్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ముదస్సర్ అజీజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : అందుకే వాటిని అన్ ఫాలో చేస్తున్నా, సోషల్ మీడియా నెగెటివిటీపై అనన్య పాండే ఆందోళన
View this post on Instagram