అన్వేషించండి

Ananya Panday: అందుకే వాటిని అన్ ఫాలో చేస్తున్నా, సోషల్ మీడియా నెగెటివిటీపై అనన్య పాండే ఆందోళన

Ananya Panday: ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నెగెటివీపై ఆందోళన వ్యక్తం చేసింది. నెగెటివ్ ప్రచారం చేసే పలు పేజీలను అన్ ఫాలో చేసినట్లు వెల్లడించింది.

Ananya Panday On Social Media: ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్ లో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సోషల్ మీడియా గురించి పలు కీలక విషయాలను వెల్లడించింది. నెట్టింట జరిగే నెగెటివిటీ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ నెగెటివిటీ ప్రచారం చేస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజీలను అన్ ఫాలో చేసినట్లు వెల్లడించింది.  

సోషల్ మీడియా నెగెటివిటీపై అనన్య ఆందోళన

గత కొద్ది సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయినట్లు చెప్పిన అనన్య, మనుషులను మానసికంగా బలహీన పరుస్తుందని వెల్లడించింది. “కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అదే సమయంలో మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ విషయం వినియోగదారులకు ఇప్పుడు తెలిసే అవకాశం లేదు. సోషల్ మీడియా కారణంగా మనుషులు మానసికంగా చాలా బలహీనం అవుతున్నారు. నా చిన్న తనంలో ఫోన్ల వినియోగం చాలా తక్కువ. అప్పుడు ప్రజలు చాలా ప్రశాంతంతగా ఉండేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. సోషల్ మీడియా చర్చలు, కామెంట్లు కూడా యువతపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే చాలా బాధపడిపోతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని పేజీలు నెగెటివిటీని కలిగిస్తున్నాయి. అలాంటి వాటిని నేను  గత కొద్ది రోజులుగా అన్ ఫాలో చేస్తున్నాను. మరికొన్నింటిని మ్యూట్ చేస్తున్నాను. నెగెటివిటీని ప్రచారం చేయడాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నాను. రోజులో కొంత సేపైనా ఒంటరిగా ఉండేలా ఫ్లాన్ చేసుకుంటాను. ఆ సమయంలో నా గురించి నేను ఆలోచించుకునే ప్రయత్నం చేస్తాను” అని వెల్లడించింది.   

వరుస సినిమాలతో అనన్య పాండే ఫుల్ బిజీ

అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'పతి పత్నీ ఔర్ వో' 'కాలీ పీలీ' 'గెహ్రాయియాన్​'  సహా పలు సినిమాల్లో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొంది. మూవీ సక్సెస్ కాకపోయినా, ఆమెకు మాత్రం మంచి క్రేజ్ లభించింది. అయినప్పటీ, తెలుగులో మరో సినిమా చేసే ప్రయత్నం చేయలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అటు యాడ్స్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపిస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. అందాల విందుతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.   

Read Also: కాటన్ చీర, చేతికి వాచ్, నుదిటిన బొట్టు- ఆకట్టుకుంటున్న సారా కొత్త సినిమా లుక్

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget