By: ABP Desam | Updated at : 23 May 2023 08:12 AM (IST)
'భోళా శంకర్'లో చిరంజీవి, తమన్నా (Image Courtesy : akentsofficial & tamannaahspeaks / Instagram )
డ్యాన్స్ విషయానికి వస్తే ఎన్నేళ్ళు అయినా సరే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని దర్శకుడు మెహర్ రమేష్ సంతోషంగా చెబుతున్నారు. 'ఇంద్ర' నుంచి 'భోళా శంకర్' వరకు చిరు స్వాగ్ అలా కంటిన్యూ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ, ఇప్పుడు 'ఇంద్ర' ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే...
స్విస్ కొండల్లో సాంగ్!
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). ఇందులో మెగాస్టార్ జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటిస్తున్నారు. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ డ్యూయెట్ ఒకటి తెరకెక్కించారు. ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
స్విట్జర్లాండ్ (Switzerland)లో 'భోళా శంకర్' సాంగ్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తమ యూనిట్ ఇండియా రిటర్న్ అయ్యిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. పాట చాలా అందంగా వచ్చిందని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్కడ చిత్రీకరణ చేయడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. యువ సంగీత దర్శకుడు సాగర్ మహతి అందించిన బాణీకి శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయగా... సినిమాటోగ్రాఫర్ డడ్లీ అందంగా తెరకెక్కించారని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఇంద్ర సినిమాలో ఓ పాటను సైతం స్విస్ కొండల్లో తీశారు. అదీ సంగతి!
Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?
#MegaStarChiranjeevi @tamannaahspeaks @BholaaShankar returning after a song shoot in Switzerland🇨🇭
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 22, 2023
Exotic yet very hard to work locations & weather.
I thank my unit for their dedication 🙏🏻@Sekharmasteroff choreography @dudlyraj Visuals
#sagarmahati composition@AKentsOfficial pic.twitter.com/S8imIm3Hg9
ఆగస్టు 11న 'భోళా శంకర్' విడుదల!
ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. విడుదల తేదీ మారోచ్చని ఆ మధ్య వినిపించింది. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేశారు. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
Also Read : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!
తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కు రీమేక్ ఇది. చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ, సంగీతం : మహతి స్వర సాగర్, నిర్మాణ సంస్థ : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత : రామ బ్రహ్మం సుంకర, కథనం, దర్శకత్వం : మెహర్ రమేష్.
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి