అన్వేషించండి

చిరంజీవితో మరో సినిమా తీస్తా - నిర్మాత వాట్సాప్ చాట్ లీక్, అందులో ఏముందంటే?

రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత అనిల్ సుంకరను చిరంజీవి ఇబ్బంది పెడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదలై డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే మెగాస్టార్ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కినా.. ఆ తర్వాత రోజు నుంచి వసూళ్లు మొత్తంగా పడిపోయాయి. ఇక అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కూడా విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుని, తమిళం తో పాటు తెలుగులోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే 'భోళాశంకర్' విడుదల తర్వాత తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా చిరంజీవి తన రెమ్యూనరేషన్ కోసం నిర్మాత అనిల్ సుంకరను ఇబ్బంది పెడుతున్నారనే వార్త బయటకు వచ్చింది. అంతేకాదు మెగాస్టార్ కి రెమ్యునరేషన్ చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను సైతం తాకట్టు పెడుతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే అంశంపై రీసెంట్ గా 'బేబీ' సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన చెబుతూ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఆయన ఇంటికి వెళ్లగా.. దగ్గరుండి మరి బాగా చూసుకున్నారని ట్వీట్ చేశారు. ఇంతలోనే తాజాగా 'భోళాశంకర్' నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రత్యక్షమైంది.

ఈ వాట్సాప్ చాట్ లో ఓ మెగా అభిమాని నిర్మాత అనిల్ సుంకరను.." సార్ రెమ్యునరేషన్ విషయంలో మీపై వస్తున్న వార్తలు నిజమేనా" అంటూ మెసేజ్ చేశారు. అది చూసిన అనిల్ సుంకర..' అలాంటిదేం లేదు. నేను ఫ్లైట్ లో యూ ఎస్ వెళ్తున్నా' అంటూ బదులిచ్చారు. తర్వాత ఇది ఒకసారి చూడండి సార్ అని అభిమాని అడగ్గా దానికి సమాధానం ఇస్తూ.." మీరు అలాంటివేమీ పట్టించుకోవద్దు. నేను చిరంజీవి గారితో మరో సినిమా తీయబోతున్న. చిరంజీవి చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ప్రశ్నలన్నింటికీ సినిమాతోనే సమాధానం చెబుతాం" అంటూ ఆ మెగా అభిమానికి రిప్లై ఇచ్చారు అనిల్ సుంకర. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనిల్ సుంకర వాట్సాప్ చాట్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వాట్సాప్ చాట్ చూస్తే ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ నిజం కాదని స్పష్టమవుతుంది.

ఇక 'భోళాశంకర్' సినిమా విషయానికొస్తే.. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' అనే చిత్రానికి ఇది తెలుగు రీమేగా తెరకెక్కింది. డైరెక్టర్ మెహర్ రమేష్ ఒరిజినల్ వెర్షన్లోని మెయిన్ థీమ్ ని తీసుకుని తెలుగు నేటివిటీకి అలాగే మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లు ఎన్నో మార్పులు, చేర్పులు చేశారు. మెగాస్టార్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా కనిపించింది. ఓ మోస్తారు అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సినిమాలో స్క్రీన్ ప్లే ఏ మాత్రం ఆకట్టుకోకపోవడం, రొటీన్ కమర్షియల్ అవుట్ డేటెడ్ స్టోరీ కావడం, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాని తిరస్కరించారు.

Also Read : నువ్వు ఎంచుకున్న నాట్యం ఏమిటీ? నువ్వు చేస్తున్నదేమిటీ- కంగనా ‘చంద్రముఖి’ డ్యాన్స్‌పై ట్రోల్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget