News
News
వీడియోలు ఆటలు
X

Bhishma Combo Repeat: నితిన్, రష్మిక మూవీకి మెగాస్టార్ క్లాప్ - ‘భీష్మ’ త్రయంపై ఫ్యాన్స్ ఆశలు

హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో మరో సారి సినిమా రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి పూజా కార్యక్రమం జరగగా..మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.

FOLLOW US: 
Share:

హీరో నితిన్, హీరోయిన్- రష్మిక మందన్న కాంబినేషన్ లో మరో సారి సినిమా రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమం జరగ్గా.. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.

హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన 'భీష్మ' ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'భీష్మ' నిలిచింది. ఇప్పుడు మరోసారి వారిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడంతో సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది.

హీరోలైనా, హీరోయిన్లైనా.. కొంతమందికి కొందరి కాంబినేషన్ బాగా కలిసొస్తుంది. వారితో చేస్తే మళ్లీ హిట్ ఖాయమని నమ్మేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. గతంలో దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో 'భీష్మ' సినిమా వచ్చింది. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ ను అందుకొని నితిన్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇప్పుడు మరోసారి ఈ మ్యాజిక్ కాంబో రిపీట్ కాబోతుంది. ఈ మూవీని 'మైత్రీ మూవీ మేకర్స్' సంస్థ నిర్మిస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు నితిన్, రష్మిక మందన్నతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా.. ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఇక దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

ఇక నితిన్ నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించున్నారని సమాచారం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉండనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్, రిలీజ్ లాంటి మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నారు.

2020లో ‘భీష్మ’ సినిమా తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో నితిన్ హిట్ ను అందుకోకపోవడం ఆయన ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చాలా రోజుల తర్వాత నితిన్ సినిమా తెరకెక్కనుండడం..  మళ్లీ ఆ హిట్ కాంబోలో ఈ మూవీ రానుండడంతో అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Published at : 24 Mar 2023 05:58 PM (IST) Tags: Rashmika Mandanna Megastar Chiranjeevi Nithin Venki Kudumula

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి