Bhartha Mahasayulaku Wignyapthi Censor Review : రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సెన్సార్ రివ్యూ - రన్ టైం ఎంతంటే?
Bhartha Mahasayulaku Wignyapthi Review : రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ సంక్రాంతికి టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ రెడీ అయ్యిందని మేకర్స్ తెలిపారు.

Ravi Teja's Bhartha Mahasayulaku Wignyapthi Censor Review : మాస్ మహారాజ రవితేజ రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి.
రన్ టైం ఎంతంటే?
ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ టీం అఫీషియల్‌గా వెల్లడించింది. రన్ టైం 2 గంటల 10 నిమిషాలు అని తెలుస్తుండగా... రవితేజ యాక్టింగ్, తనదైన కామెడీ టైమింగ్, పంచులు అదిరిపోయాయని తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ వైబ్ రెడీ అయ్యిందని... ఈ సంక్రాంతికి టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తోందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే బుకింగ్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు.
It’s U/A for #BharthaMahasayulakuWignyapthi ❤🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) January 11, 2026
Blockbuster vibes already 💥💥
This Sankranthi will have top class entertainment 🤩
Bookings open soon!#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl @sudhakarcheruk5 @AshikaRanganath… pic.twitter.com/qTBpt4y1QM
Also Read : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్ టీజర్ ఎప్పుడు?
ఈ మూవీలో కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా... రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే వెన్నెల కిశోర్, సునీల్, సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేశాయి. యాక్షన్ సీక్వెన్స్‌తో కాకుండా డిఫరెంట్‌గా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రవితేజ అలరించబోతున్నారు.






















