అన్వేషించండి

Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!

‘భారతీయుడు’ సీక్వెల్ మూవీ ‘భారతీయుడు 2’ ట్రైలర్ వచ్చేసింది. కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్, రకుల్ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. మరి, టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదా?

Bharateeyudu 2 Trailer: బ్లాక్‌బస్టర్ మూవీ ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు 2’ (Indian 2) మూవీ విడుదలకు సిద్ధమైంది. సుమారు 28 ఏళ్ల తర్వాత సీనియర్ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ఇంకా సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో ఆటంకాల మధ్య ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధం కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మంగళవారం విడుదలైన ‘భారతీయుడు 2’ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. 

‘‘ఊరా ఇది? చదువుకు తగ్గ జాబ్ లేదు. జాబ్‌కు దగ్గ జీతం లేదు. కట్టిన ట్యాక్స్ తగినట్లు ఫెసిలిటీస్ దొరకడం లేదు. దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు. తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’’ అంటే ఒక ఫిమేల్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. ‘‘మనం ఒక్కొక్కరిని తప్పుబడుతూనే ఉన్నాం. సిస్టం సరిగ్గాలేదు.. సరిచేయాలి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం. కానీ, దాన్ని సరిచేయడానికి కొంచెం కూడా ప్రయత్నించడం లేదు’’ అంటూ సిద్ధార్థ్ పాత్రను పరిచయం చేశారు. 

కమల్ ఎంట్రీ సీన్ అదుర్స్ అంతే.. 

‘‘వీళ్లందరినీ చీల్చి చెండాడే హంటింగ్ డాగ్ రావాలి’’ అని సిద్దార్థ్ అంటాడు. ‘‘అలా ఎవరు ఉంటారు రా’’ అని ప్రియ భవానీ శంకర్ ప్రశ్నిస్తుంది. ‘‘ఉండేవారు’’ అంటూ సిద్ధార్థ్ చేప్పే డైలాగ్‌తో కమల్ హాసన్ (సేనాపతి) ఎంట్రీ సీన్ వస్తుంది. ఈ సారి ఆ పాత్రను మరింత బలంగా చూపించేందుకు అన్ని విద్యల్లో ఆరితేరినట్లుగా చూపించారు. ఈ సారి సేనాపతిగా పలు గెటప్స్‌తో ఆకట్టుకున్నారు కమల్. ఇందులో ఎస్.జె.సూర్యను ప్రతినాయకుడి పాత్రలో చూపించారు. ‘భారతీయుడు’ మూవీ కనెక్టివిటీ మిస్ కాకుండా ఉండేందుకు.. ఆ మూవీలోని పోలీస్ అధికారితో ‘‘నా కెరీర్‌లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి’’ అనే డైలాగ్ చెప్పించారు.

ఆ తర్వాత.. సేనాపతిని యాంటీ ఇండియన్‌గా ప్రకటించేందుకు కుట్రలు చెయ్యడం. ప్రతినాయకులను ఎదుర్కోవడం వంటి సీన్స్‌తో ట్రైలర్ నిండిపోయింది. ‘‘ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను. పారిపోలేరు దాక్కోలేరు’’ అంటూ చివర్లో.. ‘‘టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైంది. మీయామ్’’ అంటూ కమల్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ సీన్ అదుర్స్ అనిపిస్తుంది. ఈ సీన్‌కు తప్పకుండా థియేటర్‌లో విజిల్స్ పడతాయి. అలాగే యాక్షన్ సన్నివేశాలైతే పిచ్చెక్కిస్తాయి. ముఖ్యంగా సింగిల్ వీల్ స్కూటర్‌పై చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి ‘భారతీయుడు 2’ ట్రైలర్ అంచనాలకు తగినట్లే ఉందనిపిస్తుంది. మరి, ప్రేక్షకుల ఒపినీయన్ ఎలా ఉంటుందో చూడాలి. 

‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి: 

‘భారతీయుడు 2’ మూవీ జులై 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి కమల్ ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌కు అందుబాటులోకి రానున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ‘భారతీయుడు’ మూవీని కూడా నేరుగా ఈ మూడు భాషల్లో రిలీజ్ చేసి.. అప్పట్లో రికార్డులు కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు 2’పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘భారతీయుడు’ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది. అయితే, సీక్వెల్‌కు మాత్రం అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం విడుదలైన పాటలైతే అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. మరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: టెన్షన్‌ పెడుతున్న 'భారతీయుడు 2' అప్‌డేట్స్‌ - మూవీపై అలాంటి రూమర్స్‌, ఇంతకి ఇది శంకర్‌ సినిమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget