Bhagavanth Kesari : 'భగవంత్ కేసరి' సెన్సార్ హోగయా - ఫస్ట్ రివ్యూ ఏంటంటే?
Bhagavanth Kesari First Review : నట సింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా 'భగవంత్ కేసరి' సెన్సార్ పూర్తి అయ్యింది. ఫస్ట్ రివ్యూ ఏమిటంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie) విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేశారు. ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.
సెన్సార్ పూర్తి... సినిమాకు యు/ఎ
Bhagavanth Kesari censor report : 'భగవంత్ కేసరి' సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలతో కలిసి పిల్లలు కూడా థియేటర్లకు వెళ్ళవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉన్నపటికీ... వాటిలో వయలెన్స్ మోతాదు మించలేదని తెలిసింది.
'భగవంత్ కేసరి' చూసిన తర్వాత అనిల్ రావిపూడిలో కొత్త దర్శకుడిని చూశామని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని తెలిసింది. ఇప్పటి వరకు ఆయనలో కామెడీ & ఎమోషన్స్ చూసిన ప్రేక్షకులు, ఈ సినిమాతో కంటెంట్ ఉన్న దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకుంటారని చెప్పారట. మరోవైపు తనకు తాను క్రిటిక్ అని చెప్పుకొనే దుబాయ్ బేస్డ్ ఉమైర్ సందు సైతం సెన్సార్ పూర్తి అయ్యాక ఈ ఏడాది బాలకృష్ణదే అని, సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ట్వీట్ చేశారు.
Also Read : 'సలార్' vs 'డంకీ' - ప్రభాస్‌తో పోటీలో వెనక్కి తగ్గని షారుఖ్
బాలకృష్ణ, కాజల్ పాట వారం తర్వాత నుంచి!
'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. వాళ్ళిద్దరి మీద ఒక డ్యూయెట్ కూడా తెరకెక్కించారు. అయితే... ఆ పాటను అక్టోబర్ 19న విడుదల చేస్తున్న సినిమా నుంచి తీసేశారు. కథకు అడ్డు తగులుతుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. థియేటర్లలో తొలి వారం నిజాయతీగా కథ చెప్పాలని అనుకోవడం వల్ల ఆ పని చేస్తున్నామని, అసలు ఈ కథ పాటలు డిమాండ్ చేయలేదని, అందుకని ఓ పాట షూట్ చేసినా సినిమాలో ఉంచడం లేదని చెప్పారు.
#BhagavanthKesari Censor Screening Done ✅! #NandamuriBalakrishna 2023 belongs to you ❤️🔥
— Umair Sandhu (@UmairSandu) October 12, 2023
అక్టోబర్ 24 నుంచి... అనగా సినిమా విడుదలైన వారం తర్వాత నుంచి బాలకృష్ణ, కాజల్ సాంగ్ యాడ్ చేస్తామని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. నందమూరి అభిమానులకు దసరా బొనాంజా ఉంటుందని ఆయన చెప్పారు.
Also Read : 'గుంటూరు కారం' తర్వాత రాజమౌళి సినిమాయే - మధ్యలో మరొకటి లేదు!
'భగవంత్ కేసరి' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial