Bhaag Saale - Bandla Ganesh Interview : శ్రీ సింహా లాంటి హీరోలు ఇండస్ట్రీకు చాలా అవసరం: బండ్ల గణేష్
గతేడాది ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు శ్రీ సింహా. ఈ యంగ్ హీరో ఇప్పుడు ‘భాగ్ సాలే’ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఈ మూవీకు..
గతేడాది ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు శ్రీ సింహా. ఈ యంగ్ హీరో ఇప్పుడు ‘భాగ్ సాలే’ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఈ మూవీకు ప్రణీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు ఆయన నీహారికతో 'సూర్యకాంతం' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్. జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ తో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీ సింహా లాంటి హీరోలు ఇండస్ట్రీకు రావాలి: బండ్ల గణేష్
ఇంటర్వ్యూలో భాగంగా మూవీ టీమ్ తో బండ్ల గణేష్ ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రణీత్, హీరో శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కాల భైరవ, శ్రీసింహాలను ప్రశంసించారు. సాధారణంగా సెలబ్రెటీల పిల్లలంటే కొంత మందికి కొంచెం గర్వం ఉంటుందని, కానీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పిల్లలు అయి ఉండి ఎవరి గుర్తింపు కోసం వారు కష్టపడడం చూస్తే ముచ్చటేస్తోందన్నారు. శ్రీ సింహా కూడా కష్టపడే వ్యక్తి అని ఇలాంటి టాలెంటెడ్ హీరోలు ఇండస్ట్రీకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా తండ్రి కీరవాణి పేరు నిలబెట్టడంలో కాల భైరవ సక్సెస్ అవుతున్నాడని ప్రశంసించారు.
నవ్వును నమ్ముకున్న డైరెక్టర్లు ఎక్కువ కాలం ఉంటారు: బండ్ల గణేష్
ఇదే ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ దర్శకుడు ప్రణీత్ గురించి మాట్లాడారు. దర్శకుడు ప్రణీత్ ఈ ఇంటర్వ్యూ గురించి ఫోన్ చేసినప్పుడే అతని టాలెంట్ ను గుర్తించేశానని అన్నారు గణేష్. సినిమా ట్రైలర్ చూశాక మూవీపై తనకు కూడా ఇంట్రస్ట్ పెరిగిందని, ‘భాగ్ సాలే’ అనే టైటిల్ తోనే మూవీపై హైప్ క్రియేట్ చేశారని అన్నారు. నవ్వించే సినిమాలు తీసే ప్రణీత్ లాంటి యంగ్ డైరెక్టర్లు ఇంకా ఇండస్ట్రీకు రావాలని అన్నారు. నవ్వుని నమ్ముకున్న దర్శకుడికి ఇండస్ట్రీలో ఎక్కవ కాలం లైఫ్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సినిమాలు చూస్తే ప్రశాంతంగా నవ్వుకోవచ్చని, తమలాంటోళ్లకు కోడి గుడ్డు పెట్టిందా లేదా అనే తలనొప్పులు కాస్త తగ్గుతాయని వ్యాఖ్యానించారు. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని, మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఆకాంక్షించారు.
ఇది కామెడీ ఎంటర్టైనర్ సినిమా: దర్శకుడు ప్రణీత్
ఈ ఇంటర్వూలో దర్శకుడు ప్రణీత్ ‘భాగ్ సాలే’ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకుడిని నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాను తీశామని అన్నారు ప్రణీత్. సినిమా మొత్తం ఒక రింగ్ చుట్టూ తిరుగుతుందని, ప్రతీ క్యారెక్టర్ కు ఆ రింగ్ తో సంబంధం ఉంటుందని, ఆ క్రమంలోనే ఫుల్ ఫన్ జనరేట్ అవుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని, వేరే ఎలాంటి కాలుక్యులేషన్స్ పెట్టుకోకుండా కేవలం నవ్వించడమే లక్ష్యంగా సినిమాను తెరకెక్కించామని చెప్పారు.
Also Read: టాలీవుడ్‌లో దుకాణం సర్దేస్తున్న కీర్తి, కృతి - ఒకరు కోలీవుడ్‌కు, మరొకరు మాలీవుడ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial