అన్వేషించండి

‘ఆదిపురుష్’ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావు తెరకెక్కించిన మైథాలజికల్ మూవీ 'ఆదిపురుష్' సినిమా కి సంబంధించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం యావత్ సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. రామాయణం ఇతిహాసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఎమోషన్ క్యాప్చర్ 3D అనే సరికొత్త టెక్నాలజీ తో ఓ విజువల్ వండర్ ని ఆదిపురుష్ మూవీతో క్రియేట్ చేశారు మేకర్స్. ఇందుకు సుమారు 500 కోట్లకు పైగానే ఖర్చయింది. ఇప్పటికే ఆదిపురుష్ నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టాయి. 'ఆదిపురుష్' అనే పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్. ఈ డీటెయిల్స్ తప్ప ఆదిపురుష్ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఎవరికి పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇందులో సౌత్ నటీ నటులు లేకపోవడం కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. కాగా మరో రెండు రోజుల్లో అంటే జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతున్న 'ఆదిపురుష్' మూవీ గురించి ఎవరికి తెలియని 10 ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం.

1. 'ఆదిపురుష్' మూవీని 1952 లో వచ్చిన 'రామాయణ : ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' అనే చిత్రం ద్వారా స్ఫూర్తి పొంది ఈ సినిమాని తెరకెక్కించారట ఓం రౌత్. అది యానిమేషన్ మూవీ అయితే, ఆదిపురుష్ ఏమో రియల్ యాక్టర్స్ తో తీసిన మూవీ.

2. నిజానికి ఆదిపురుష్ సినిమాకి మొదట్లో అనుకున్న బడ్జెట్ 400 కోట్లు మాత్రమే. కానీ గత ఏడాది టీజర్ రిలీజ్ అయ్యాక గ్రాఫిక్స్ పరంగా విపరీతమైన విమర్శలు వచ్చాయి. దాని ఫలితంగా మరో 100 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. దీంతో పూర్తి బడ్జెట్ మొత్తం రూ.500 కోట్లకు చేరింది.

3. ఈ సినిమాకి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ కృతి సనన్ కాదట. సినిమాలో జానకి పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియరా అద్వానీ, కీర్తి సురేష్ ఇలా చాలామంది పేర్లను పరిశీలించారట.

4. ఇక ఆదిపురుష్ కోసం దర్శకుడు ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం.

5. 20201 లో ఆదిపురుష్ షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు ముంబైలో వేసిన ఓ భారీ సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు. ఇక తర్వాత అలాంటి సెట్స్ మళ్ళీ వేసి షూటింగ్ పూర్తి చేశారు.

6. ఇక రీసెంట్ గా జూన్ 6న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీం దాదాపు రెండు కోట్లకు పైనే ఖర్చు చేశారట.

7. ఇక ఈ సినిమాని థియేటర్స్ లో కంటే ముందు అంటే జూన్ 13న ట్రిబేక ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉందని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే రీజన్స్ ఏంటో తెలియదు కానీ మూవీ యూనిట్ ఆ స్క్రీనింగ్ ని రద్దు చేసుకున్నారు.

8. ఇక ఆదిపురుష్ సినిమా కోసం మన డార్లింగ్ ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డును సృష్టించాడు.

9. ఇక ఈ సినిమాని త్రీడీ తో పాటు ఐమాక్స్ ఫార్మాట్ లోను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఐమాక్స్ వెర్షన్ ని క్యాన్సిల్ చేశారు. దీనికి హాలీవుడ్ మూవీ 'ద ఫ్లాష్' ఓ కారణమని తెలుస్తోంది.

10. 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ తెలుగు, హిందీలో ఒకేసారి జరిగింది. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు. కానీ హిందీలో కుదరలేదు. దీంతో హిందీలో ప్రభాస్ కి బదులుగా శరత్ కేల్కర్ డబ్బింగ్ చెప్పాడు. గతంలో బాహుబలి హిందీ వర్షన్ కి ప్రభాస్ పాత్రకి ఇతనే డబ్బింగ్ చెప్పడం విశేషం. 

సో మొత్తం మీద ఆదిపురుష్ సినిమాకి ఇవి కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: వామ్మో! ఒక్క టికెట్ ధర రూ.2 వేలా? హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘ఆదిపురుష్’ టిక్కెట్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
Embed widget