NBK 109 Release Date: సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా - రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగవంశీ
Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు. సంక్రాంతి బరిలో థియేటర్లలోకి వస్తుందని చెప్పారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తే అప్పుడే పండగ. అటువంటిది పెద్ద పండక్కి సినిమా వస్తే జాతరే... థియేటర్లలో ప్రేక్షకుల జాతరే. ఆ జాతర వాతావరణాన్ని వచ్చే సంక్రాంతికి తీసుకు రావడానికి మరొక సారి థియేటర్లలోకి రానున్నారు బాలకృష్ణ.
సంక్రాంతి బరిలో బాలకృష్ణ 109 సినిమా విడుదల
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (NBK 109 Movie) రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థల మీద తెరకెక్కుతున్న చిత్రం ఇది. సూర్యదేవర నాగవంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.
Also Read: బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
Team #NBK109 wishes you all a #HappyDussehra 🔱🔥
— Sithara Entertainments (@SitharaEnts) October 12, 2024
Get ready to meet the 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna garu, in his most stylish action avatar yet this Sankranti 2025! 💥🤙🏻#NBK109TitleTeaser will be out this Diwali❤️🔥@dirbobby @MusicThaman @thedeol… pic.twitter.com/MUgwLB0Kwc
'సర్కార్ సీతారాం' టైటిల్ ఖరారు చేశారా?
NBK 109 Titled Sarkaar Sitharam?: సినిమా విడుదల తేదీ వెల్లడించారు కానీ టైటిల్ ఏమిటనేది ఇంకా చెప్పలేదు. 'లక్కీ భాస్కర్' ప్రీమియర్ షో వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ దీపావళికి బాలయ్య గారి కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పారు. యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి 'సర్కార్ సీతారాం' (Sarkaar Sitharam) టైటిల్ ఖరారు చేశారట.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో గ్లింప్స్, అంతకు ముందు మరొక వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆ రెండు చాలా మాస్ గా ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరినీ అలరించేలా మాస్ యాక్షన్ అంశాలు మేళవించే బాబీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతోంది.
Also Read: ‘అన్ స్టాపబుల్’తో పండుగ తెస్తున్న బాలయ్య - ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది?
బాలకృష్ణ సరసన హీరోయిన్లు ఎవరో తెలుసా?
బాలకృష్ణ సరసన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్ జెర్సీ ఫ్రేమ్స్ శ్రద్ధా శ్రీనాథ్ కాగా... మరొక హీరోయిన్ ఊర్వశి రౌతేలా. 'యానిమల్' ఫేమ్, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. 'వీర సింహా రెడ్డి' సినిమాతో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో దర్శకుడు బాబి ఒకే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చారు. ఆ రెండు సినిమాలు విజయాలు సాధించాయి. ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాను సైతం సంక్రాంతి బరిలో తీసుకు వస్తుండడం విశేషం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.