అన్వేషించండి

Balakrishna New Movie: బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?

NBK 110 Movie Opening: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించే సినిమా ఓపెనింగ్, పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు అయ్యింది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ అంటే కేవలం నందమూరి అభిమానుల్లో మాత్రమే కాదు... ప్రేక్షకులు అందరిలోనూ ఓ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఆ సినిమా ఓపెనింగ్, పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేశారు.  

అక్టోబర్ 16న #BB4 ఓపెనింగ్!
'సింహ'తో బాలకృష్ణ, బోయపాటి ప్రయాణం మొదలైంది. నటసింహ నందమూరి బాలకృష్ణ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో... ఆ అంశాలు అన్నిటితో పాటు కథ, క్యారెక్టరైజేషన్‌లతో సినిమా తీసి అఖండ విజయం సాధించారు. 'సింహ' విజయం తర్వాత 'లెజెండ్', 'అఖండ'తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్ సినిమాను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ రోజు విజయ దశమిగా సందర్భంగా అప్డేట్ ఇచ్చారు. 

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించే ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ నెల (అక్టోబర్) 16న ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. గ్రాండ్ లాంచ్ సెర్మనీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలకృష్ణ, బోయపాటి కలయికలో నాలుగో సినిమా కనుక #BB4 Movie అని వ్యవహరిస్తున్నారు. ఎం తేజస్వనీ నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాణంలో రూపొందుతున్న చిత్రమిది. దీని కంటే ముందు బాలకృష్ణ, బోయపాటి 'లెజెండ్' నిర్మాణంలోనూ ఈ అన్నదమ్ములు ఉన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమాను రూపొందించనున్నారు.

Also Read: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్


NBK 110 Movie: కథానాయకుడిగా బాలకృష్ణ 110వ చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది? ఈ సినిమా కథ ఏమిటి? వంటి వివరాలను ఈ నెల 16న వెల్లడించనున్నారు. 'అఖండ' తరహాలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 'అఖండ 2'గా ఈ సినిమా ఉంటుందా? లేదంటే మరొక కథ అనేది కూడా ఓపెనింగ్ రోజు క్లారిటీ రానుంది. ఆల్రెడీ బాలకృష్ణ సినిమా ఒకటి సెట్స్ మీద ఉంది. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

Also Readసంక్రాంతి బరిలోనే రామ్ చరణ్ సినిమా - గేమ్ చేంజర్ విడుదలపై దిల్ రాజు ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget