Unstoppable With NBK Season 4: ‘అన్‌స్టాపబుల్’తో పండుగ తెస్తున్న బాలయ్య - ఎప్పట్నుంచి స్టార్ట్ అవుతుంది?
Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సూపర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. దీనికి సంబంధించిన నాలుగో సీజన్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Unstoppable With NBK Season 4 Trailer: నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ముందుకు తీసుకువచ్చిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable With NBK). ఇప్పటికే మూడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ టాక్ షోకి సంబంధించిన నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నాలుగో సీజన్ ట్రైలర్‌ను ఇప్పుడు లాంచ్ చేశారు. నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ట్రైలర్ ఎలా ఉంది?
ఇది ఒక యానిమేటెడ్ ట్రైలర్. ఇటీవలే ‘సరిపోదా శనివారం’తో మంచి పేరు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ దీనికి సంగీతం అందించారు. ఒక పండగ లేని ప్రాంతంలో పండుగను తెచ్చే హీరోగా ఇందులో బాలయ్య కనిపించారు. చివర్లో ఆయన తన ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాల’ చెప్పడం కూడా ఇందులో చూడవచ్చు. అక్టోబర్ 24వ తేదీ నుంచి ఈ కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తి...
దీనికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్లకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సన్నీ డియోల్, గోపిచంద్ మలినేనిలతో ఒక ఎపిసోడ్, అల్లు అర్జున్‌తో ఒక ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరితో షూట్ అయింది? అవి ఎప్పుడు స్ట్రీమ్ అవుతాయనే విషయాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
ఎన్‌బీకే109 అప్‌డేట్ నేడే...
నందమూరి బాలకృష్ణ, ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అప్‌డేట్ కూడా నేడే (అక్టోబర్ 12వ తేదీ) రానుంది. ఈరోజు సాయంత్రం 5:47 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమా దిగనుందని తెలుస్తోంది. జనవరి 12వ తేదీన ఎన్‌బీకే 109 సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రమే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.
Also Read: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
టైటిల్ అదేనా...
ఈ సినిమా టైటిల్, టీజర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాకు ‘డాకూ మహరాజ్’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతకు ముందు కూడా ఈ సినిమా టైటిల్ గురించి చాలా రూమర్స్ వినిపించాయి. కానీ ‘డాకూ మహరాజ్’ అనే టైటిల్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
పండుగ సమయం వచ్చేసింది!🥳
— ahavideoin (@ahavideoIN) October 12, 2024
The Massiest superhero is here.. 💥⚡
Jai Balayya.. 🙋🏻♀️🙋🏻♂️
Watch #UnstoppableS4 trailer▶️https://t.co/14OCztzA78#UnstoppableWithNBK #UnstoppableS4 #AhaOriginalSeries #NandamuriBalakrishna #JaiBalayya #NBK pic.twitter.com/STGikLw2I3