అన్వేషించండి

Vaishnavi Chaitanya: బ్లాక్ బస్టర్ కొట్టినా.. ‘బేబీ’ బ్యూటీకి అందని ఆఫర్లు! కారణం ఏంటో?

తెలుగులో ఓవర్ నైట్ స్టార్లు మారిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్క చిత్రంతో స్టార్ హీరోయిన్లుగా మారిన వాళ్లూ ఉన్నారు. కానీ, ‘బేబీ’ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టినా, వైష్ణవికి మాత్రం అవకాశాలు రావడం లేదు.

తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులు ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకే ఒక్క సాలిడ్ హిట్ తో టాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్లు ఉన్నారు. 2021లో అరంగేట్రం చేసిన శ్రీలీల, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు ఇలాంటి కోవకు చెందినవాళ్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఏకంగా డజన్ చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో సగానికి పైగా స్టార్ హీరోల సినిమాలే ఉన్నాయి. ‘పెళ్లి సందడి’ తర్వాత, ‘ధమాకా’లో కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ,  ప్రస్తుతం ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘స్కంధ’, ‘భగవంత్ కేసరి’తో పాటు విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్,  నితిన్‌ చిత్రాల్లో నటిస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత కృతిశెట్టికి సైతం ఆఫర్లు క్యూ కట్టాయి. ‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘ది వారియర్’, ’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’తో పాటు ‘బంగార్రాజు’ చిత్రాలను గ్యాప్ లేకుండా చేసింది. 

‘బేబీ’ బ్లాక్ బస్టర్ అయినా అవకాశాలు రాలే!

తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నా, ఇప్పటికీ ఒక్క కొత్త ఆఫర్ రాలేదు. పెద్ద సినిమా అవకాశాల మాట అటుంచితే, కనీసం చిన్ని, మధ్యతరహా బడ్జెట్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కలేదు. ‘బేబీ’లో డ్యాన్స్, ఎమోషన్స్, ఎక్స్‌ ప్రెషన్స్,  కామిక్ టైమింగ్‌తో వైష్ణవి పర్ఫెక్ట్‌ గా  కనిపించింది. కానీ, అదృష్టం ఇంకా ఆమె తలుపు తట్టడం లేదు. తెలుగు హీరోయిన్లు ఎంత అద్భుతంగా నటించినా, అవకాశాలు రావు అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తోంది. తాజాగా వైష్ణవికి అవకాశాలు రాకపోవడం చూస్తుంటే ఈ వాదనను కొట్టి పారేయలేం అనిపిస్తుంది. ఒక వేళ వైష్ణవి తెలుగు అమ్మాయి కాకపోయి ఉంటే, ఇప్పటికే వరుస అవకాశాలు వచ్చేవని మరికొందరు అంటున్నారు.

వైష్ణవి చైతన్య గురించి..

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తో ఈమె నటించిన 'బేబీ' సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమాలో వైష్ణవి తన యాక్టింగ్ తో అందరి చేత ప్రశంసలు అందుకుంది.  ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అందంగా కనిపించింది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన 'బేబీ' చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి అగ్ర తారలు వైష్ణవి నటనకి ఫిదా అయిపోయారు.  డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ్టి నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా’లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

Read Also: ‘ఉప్పెన’ కథ వినగానే చిరంజీవి అలా అన్నారు - నేషనల్ ఫిల్మ్ అవార్డుపై దర్శకుడు బుచ్చిబాబు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Embed widget