అన్వేషించండి

Atlee - Ayushmann Khurrana : అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ యంగ్ హీరో?

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేయాని ఉందని, ముఖ్యంగా అట్లీ, ఫాహాద్ ఫజిల్ లాంటి వాళ్ళతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో మార్మోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan)తో ఈ డైరెక్టర్ తెరకెక్కించిన 'జవాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్  ని సైతం విపరీతగా ఆకట్టుకుంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'జవాన్' కి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు సమాచారం. 'జవాన్' లో షారుక్ ని చూపించిన విధానానికి బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు సినీ క్రిటిక్స్ సైతం ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు అట్లీతో సినిమాలు చేసేందుకు మరి కొంతమంది బాలీవుడ్ స్టార్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ యంగ్ హీరో అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ లో డిఫరెంట్ జానర్ మూవీస్ తో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్లో విభిన్న తరహా కథలను ఎంచుకొని వాటితో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. 'విక్కీ డోనర్' 'బదాయి హో', 'శుభ్ మంగల్ సావ్ ధాన్', 'బాలా', 'డ్రీమ్ గర్ల్' 'అంధాదున్' వంటి డిఫరెంట్ జానర్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయుష్మాన్ 'సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తనకు వర్క్ చేయాలని ఉందని, ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ, మలయాళ స్టార్ ఫాహాద్ ఫజిల్ వంటి వారితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు' తెలియజేశాడు.

"నాకు ఎప్పుడూ డిఫరెంట్ స్క్రిప్స్ అండ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకొని సినిమాలు చేయాలని కోరిక ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ సబ్జక్ట్స్ సౌత్ నుండి కూడా వస్తున్నాయి. మేము వాళ్ళ కంటెంట్ ని ఎప్పటినుంచో రీమేక్ చేస్తున్నాం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ ని ఎంచుకొని సినిమా చేసే హీరోగా సౌత్ ఆడియన్స్ కి నాపట్ల కొంత గౌరవం ఉంటుంది. కెరీర్ పరంగా ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా సినిమాలు చూసి గర్వపడుతున్నాను" అని తెలిపాడు ఆయుష్మాన్ (Ayushman Khurana). అంతే కాకుండా... "నేను అట్లీ, ఫహాద్ ఫజిల్ లాంటి వాళ్లతో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్లు ఎంచుకునే సబ్జెక్ట్స్ కాస్త వేరుగా ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాను" అంటూ తాజా ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు.

దీంతో ఈ బాలీవుడ్ హీరో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా 'డ్రీమ్ గర్ల్ 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆయుష్మాన్ ఖురానా. అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ పై ఏక్తా కపూర్, శోభ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు.

Also Read : శ్రీలీల చేతుల మీదుగా విడుదలైన 'కోట బొమ్మాళి' ఫోక్ సాంగ్ - మీరు విన్నారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget