Hanuman : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ 'హనుమాన్' మేకర్స్ బంపర్ ఆఫర్ - సగం ధరకే టికెట్లు!
Hanuman : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓవర్సీస్ ఆడియన్స్ కి 'హనుమాన్' మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Team Hanu-Man comes up with a unique initiative : యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్'(Hanuman) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాకి అన్ని చోట్ల నుంచి భారీ ప్రేక్షకాదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకి భారీ ఆదరణ లభిస్తోంది.
ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఓవర్సీస్ ఆడియన్స్ కి హనుమాన్ మేకర్స్ ఆ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే, యూఎస్ లోని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. యూ ఎస్ లో హనుమాన్ మూవీ ప్రదర్శింపబడుతోన్న 11 థియేటర్లలో జనవరి 22 సోమవారం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈ టికెట్ల తగ్గింపు అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. అది కూడా కేవలం కౌంటర్ల దగ్గర నేరుగా టికెట్లు కొనేవారికి మాత్రమే ఈ సగం ధరకు టికెట్లు లభిస్తాయని.. ఆన్‌లైన్ బుకింగ్ కు ఆ అవకాశం లేదని తెలిపారు.
Celebrating the inauguration of Ayodhya Ram Mandir, few locations in USA are screening #HANUMAN with Half-Priced Tickets 😍
— Primeshow Entertainment (@Primeshowtweets) January 22, 2024
Checkout the list from @AppleCinemas, @CineLoungeusa & @bbtheatres & Enjoy Epic Cinema 🍿
A @PrasanthVarma film
🌟ing @tejasajja123
Overseas Release by… pic.twitter.com/8vROjcAE9o
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆపిల్ సినిమాస్ తోపాటు రెండు చోట్ల సినీలాంజ్, ఒక చోట బీ అండ్ బీ థియేటర్స్ కి ఈ ఆఫర్ ఇస్తున్నారు. మొత్తంగా 11 చోట్ల ఇస్తున్న ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని యూ ఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన ప్రైమ్ షో సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ ఆఫర్ తో హనుమాన్ మూవీని చూసేందుకు అత్యధిక సంఖ్యలో ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఓవర్సీస్ లో హనుమాన్ కలెక్షన్స్ మరింత పెరగడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరోవైపు రిలీజ్ కి ముందు చిత్ర బృందం హనుమాన్ టికెట్‌పై రూ.5 చొప్పున అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
హనుమాన్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక హనుమాన్ రిలీజ్ పది రోజులు అవుతుండగా ఈ పది రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా రూ.195 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. విశేషమేంటంటే మొదటి వారం కంటే రెండో వారంలోనే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. దీన్ని బట్టి హనుమాన్ కి ఆడియన్స్ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read : 'జైలర్' సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ - ఈసారి అంతకుమించి, సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే?