Atlee Rajinikanth movie: రజినీకాంత్‌తో మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - ఆ సినిమాని మించి ఉండాలి!
Atlee : 'జవాన్' మూవీ డైరెక్టర్ అట్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ చేయబోయే సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Atlee About Rajinikanth Movie : కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ కుమార్(Atlee Kumar) రీసెంట్ గా 'జవాన్'(Jawan) మూవీ తో నార్త్ లో సత్తా చాటిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన 'జవాన్' బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో అట్లీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు అట్లీ. ఈ క్రమంలోనే అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. 'జవాన్' తర్వాత ఇప్పటివరకు అట్లీ తన నెక్స్ట్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అట్లీ చేసిన కామెంట్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 'జవాన్' తర్వాత తన నెక్స్ట్ మూవీ ఏకంగా రూ.3000 కోట్లు వసూలు చేయబోతుందని వ్యాఖ్యానించారు ఈ దర్శకుడు. అంతేకాదు షారుక్ ఖాన్, దళపతి విజయ్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నానని, వారిద్దరితో సినిమా చేస్తే ఖచ్చితంగా రూ.3000 కోట్లు ఈజీగా క్రాస్ అవుతాయని అన్నాడు. దాంతో అట్లిపై సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. అక్కడితో ఆగకుండా 'జవాన్' సినిమాను ఏకంగా ఆస్కార్ కి తీసుకెళ్తానని చెప్పడంతో ఒక్క సినిమా వెయ్యి కోట్లు సాధించినందుకు ఇంత ఓవరాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్స్ అట్లీని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడంతో పాటు ఈ మూవీ పై క్లారిటీ ఇచ్చాడు." నేను రజనీకాంత్ కు వీరాభిమానిని. రజనీకాంత్ నన్ను ముద్దుగా కన్నా అని పిలుస్తారు. నాతో సినిమా చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీ గానే ఉంటారు. తలైవా నటించిన దళపతి సినిమా చూసిన తర్వాతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను. రోబో సినిమాకి శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా. రెండు మూడు కథలు కూడా చర్చించుకున్నాం. కానీ ఆయనకు సరిపోయే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఆయనతో చేయబోయే సినిమా భాషా మూవీని మించి ఉండాలి అని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో అట్లీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల 'జైలర్'(Jailer) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండర్ యాక్టర్ అమితాబచ్చన్, దగ్గుబాటి రానా, ఫాహాద్ ఫాజిల్, రితిక సింగ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ సినిమా చేస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్‌పై అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్ - ఫ్యాన్స్ ఫిదా