అన్వేషించండి

Shivam Bhaje Movie: అశ్విన్‌ బాబు 'శివం భజే' మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - ఆ రోజు ఐదు భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‌, ఎప్పుడంటే..

Ashwin Babu Shivam Bhaje Release Date: అశ్విన్‌ బాబు హీరో పాన్‌ ఇండియా వస్తున్న చిత్రం 'శివం భజే'. అప్సర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Shivam Bhaje Movie Release Date: 'రాజుగారి గది' సిరీస్ చిత్రాలతో విజయాలు అందుకున్న హీరో  అశ్విన్ బాబు. ఇటీవల 'హిడింబ'తో మాస్‌గా కనిపించిన అశ్విన్‌ ఇప్పుడు 'శివం భజే' అంటూ డివోషనల్ మూవీతో వస్తున్నాడు. పాన్‌ ఇండియా రూపొందిన చిత్రమిది. నిజానికి ముందు నుంచి ఈ చిత్రంపై పెద్దగా బజ్‌ లేదు. కానీ, మూవీ పోస్టర్స్‌, అశ్విన్‌ ఫస్ట్‌లుక్‌తో మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక టీజర్‌తో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో అశ్విన్‌ ఉగ్రరూపం ఫ్యాన్స్‌ మతిపోగోట్టింది. శివుని నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీ మూవీ టీం ప్రకటించింది.

ఈ సినిమాను ఆగస్ట్‌ 1న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  అప్సర్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అశ్విన్‌ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌, మురళీ శర్మ, తనికేళ్ల భరణి, బ్రహ్మాజి ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. సాయి ధీన, అయ్యప్ప శర్మ,  దేవి ప్రసాద్‌, హైపర్‌ ఆది వంతి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 

ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా మూవీ నిర్మాత మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ మూవీ విశేషాలను పంచుకున్నారు. వైవిధ్యమైన కథతో వస్తున్న మా శివం భజే చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నానన్నారు. వైవిధ్యమైన కథతో వస్తున్న ఈ సినిమాను ఎక్కడ రాజీ పడకుండ సాంకేతిక విలువలతో నిర్మించామన్నారు. ఆగస్ట్‌ 1న శివం భజే విడుదల అవుతుందని వెల్లడించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిందని, దీంతో చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు.

హీరో అశ్విన్‌ బాబు, దర్శకుడు అప్సర్‌, అర్బాజ్‌ ఖాన్‌, సాయి ధీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి, హైపర్‌ ఆది వంటి నటీనటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో తమ మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుందన్నారు. ప్రస్తుతం శివం భజే నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉన్నాయని, అన్ని పూర్తయ్యాక ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతునమని తెలిపారు. శివస్మరణతో మొదలైన తమ చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని, శివం భజే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇక త్వరలోనే మూవీ ట్రైలర్,  పాటల కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. మా 'శివం భజే' మూవీ టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో మూవీ విషయంలో మా అందరి విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు అప్సర్ వైవిధ్యమైన కథకి తగ్గట్టుగా కావాల్సిన సాంకేతిక విలువలుతో తెరకెక్కించారని, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా నిర్మాత మహేశ్వర రెడ్డి గారు మంచి సహకారం అందించారన్నాడు.  ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తామని చెప్పాడు. 

Also Read: బాక్సాఫీసు వద్ద 'కల్కి 2898 ఏడీ' జోరు - ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget