Ashu Reddy Marriage : పాపం అషూరెడ్డి - పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతుందో? ఆ పద్మవ్యూహం చక్రధారికే తెలుసు
బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి వరుస సినిమాలు చేస్తోంది. ‘పద్మవ్యూహం చక్రధారికే తెలుసు’ మూవీలో పెళ్లైన మహిళగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు సంబంధించిన ఫోటోలను నెట్టిట్లోకి వదిలింది.
‘బిగ్ బాస్’ ఫేమ్ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకుంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ‘బిగ్ బాస్’తో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక, సోషల్ మీడియాలో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదు. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకుంది.
పెళ్లైన మహిళగా అషూ రెడ్డి
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి 'పద్మవ్యూహం చక్రధారికే తెలుసు'. సంజయ్ తేజ్ బంగారపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన డిటైల్స్‌ను ఈ మధ్యే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చక్కగా చీర కట్టుకుని అచ్చతెలుగు ఆడపిల్లగా ఇందులో కనిపించింది. పెళ్లయ్యాక ఓ యువతి పడే బాధలను ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను పద్మ అనే మహిళగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాలోని అషూరెడ్డి క్యారెక్టర్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. చీరలో సంప్రదాయబద్దంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఫోటోలో ముఖంపై గాయంతో రక్తం కారుతూ కనిపించింది.
Also Read : పవిత్ర బంధానికి మహేష్ ఆమోద ముద్ర, ఆమె వంట మెచ్చిన సూపర్ స్టార్ - నరేష్
View this post on Instagram
‘A మాస్టర్ పీస్’లో ‘ఆద్య’గా కనిపించనున్న అషూ
అటు అషూరెడ్డి ‘A మాస్టర్ పీస్’ అనే సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించనుంది. ఈ సినిమాలో ‘ఆద్య’ అనే పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. సుకు పూర్వాజ్ గతంలో ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి సినిమాల తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఈ మూవీలో హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్ ని బట్టి చూస్తే అరవింద్ కృష్ణ సూపర్ పవర్ ఉన్న హీరోగా కనిపిస్తారనే తెలుస్తోంది.
View this post on Instagram
అషూరెడ్డి గతంలో పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకుంటూ పబ్లిసిటీ కొట్టేసింది. పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది. బుల్లి తెరపై కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్వ్యూలు చర్చనీయాంశంగా మారాయి. సెమీ న్యూడ్ ఇంటర్వ్యూలతో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ ఇంటర్య్యూ షూట్ చేసిన తీరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయినా, ఈ అమ్మడు బోల్డ్ పబ్లిసిటీ లో ఎక్కడా తగ్గలేదు.
Read Also: లక్షన్నరతో పెళ్లి చేసుకున్న మహేష్ బాబు 'అతిథి' హీరోయిన్ - ఆ చీర 3 వేలే!