పవిత్ర బంధానికి మహేష్ ఆమోద ముద్ర, ఆమె వంట మెచ్చిన సూపర్ స్టార్ - నరేష్
'మళ్లీ పెళ్లి' తో మరోసారి పాపులర్ అయిన నటులు నరేష్, పవిత్ర... తమ రిలేషన్ షిప్ ను తమ ఫ్యామిలీ అంగీకరించినట్టు వెల్లడించారు. అందరూ పవిత్రను అంగీకరించినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టు నరేష్ స్పష్టం చేశారు.
Naresh- Pavitra : ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయిన నటులు నరేష్, పవిత్ర. 'మళ్లీ పెళ్లి' సినిమాతో మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ జంట... గత కొన్ని రోజుల నుంచి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు మార్లు వార్తల్లో నిలిచారు. నరేష్ తన మూడో భార్యతో గొడవలు, పవిత్రలో రిలేషన్ షిప్ వంటి విషయాలు వారిద్దర్నీ ఎప్పటికప్పుడూ ట్రెండింగ్ లో నిలిచేలా చేశాయి. అయితే మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్, పవిత్ర... త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నామంటూ ఇటీవల ప్రకటించారు. అయితే తమ రిలేషన్ షిప్ ను, పెళ్లి కాకుండానే కలిసి ఉండడాన్ని తమ ఫ్యామిలీ అంగీకరించినట్టు నరేష్ స్వయంగా వెల్లడించారు.
పవిత్రతో నాలుగేళ్లుగా సహ జీవనం చేస్తోన్న నరేష్... ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ కొందరు వాదించారు. పెళ్లి చేసుకోకుండానే ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఇటీవల తీసిన సినిమాలోనూ కొన్ని సన్నివేశాలు వారిద్దరి బంధాన్ని వేలెత్తి చూపేలా ఉండడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారిలా కలిసి ఉండడం కృష్ణ కుటుంబ సభ్యులకు ఓకేనా? వాళ్ల నిర్ణయం ఏంటీ? వాళ్లు వీరిని యాక్సెప్ట్ చేశారా? అన్న ప్రశ్నలు మాత్రం కొన్ని రోజులుగా చాలా మందిలో అలాగే ఉండిపోయాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నరేష్ తాజాగా సమాధానమిచ్చారు.
తాను, పవిత్ర కలిసి ఉండడం తన సోదరుడు మహేష్, తండ్రి కృష్ణకు కూడా తెలుసని నరేష్ చెప్పారు. వారు తమ బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని... అందరికీ ఇష్టమే అన్నట్టుగా ఆయన బదులిచ్చారు. మహేష్, కృష్ణ, అమ్మ విజయ నిర్మల తామంతా ఒక కుటుంబం అన్న నరేష్... ఒక మాట మీద నిలబడతామని చెప్పారు. తమ కుటుంబం కూడా పవిత్ర లోకేష్ ని ఒప్పుకున్నారంటూ నరేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనకు తెలుగు రాదని తెలిసి కృష్ణ ఇంగ్లీష్ లో మాట్లాడేవారని పవిత్ర చెప్పారు. పవిత్ర లోకేష్ చేసిన వంటలను కూడా కృష్ణ చాలా ఇష్టంగా తినే వారని, తమ మొత్తం కుటుంబానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేయగలదని నరేష్ ఈ సందర్భంగా తెలిపారు. అందరూ పవిత్రను అంగీకరించినందుకు తాను చాలా హ్యాపీగా ఉన్నట్టు నరేష్ స్పష్టం చేశారు.
Also Read : బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
దీన్ని బట్టి చూస్తే నరేశ్-పవిత్రల బంధం విషయంలో మహేష్ పాజిటివ్ గా ఉన్నారని, ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలుస్తోంది. గతేడాది కృష్ణ మరణించిన సమయంలోనూ పవిత్ర-నరేష్ అన్నీ తామై వ్యవహరించారు. భౌతిక కాయం వద్ద ఏర్పాట్లు కూడా చూసుకున్నారు.
వెయ్యి కోట్ల ఫిగర్ పై..
ఇటీవల చాలా సార్లు వినిపిస్తోన్న వెయ్యి కోట్ల ఆస్తులపైనా నరేష్ స్పందించారు. అది నిజమేనన్న ఆయన... అందులో వారసత్వంగా వచ్చింది ఉందని , కష్టపడి సంపాదించింది కూడా ఉందని, తాను నిజంగా బిలియనీరేనని ఒప్పుకున్నారు. కానీ తన వద్ద ఉన్నదంతా వైటేనని, ఎవరైనా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చని చెప్పారు. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక్కటే లైఫ్ ఇస్తాడని తాను నమ్ముతానని, తాను హ్యాపీగా ఉంటూ పది మందిని సంతోషపెట్టాలనేదే తన పాలసీ అని స్పష్టం చేశారు.
Read Also : Bichagadu 2 Collections : ఏపీ, తెలంగాణలో దుమ్ము రేపిన 'బిచ్చగాడు 2' - విజయ్ ఆంటోనీ సినిమా ఓపెనింగ్స్ ఎంతంటే?