Ashu Reddy Yevam: అషు రెడ్డి బోల్డ్ లుక్ -'నా బాడీ సూపర్ లగ్జరీ' అంటూ హారికను పరిచయం చేసిన 'యేవమ్' టీం
Ashu Reddy Yevam Look: అషురెడ్డి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'యేవమ్'. చాందిని చౌదరి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి అషు లుక్ రిలీజ్ చేశారు.
Ashu Reddy Look From Yevam: అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డబ్‌స్మాష్ వీడియోస్‌తో పాపులర్ అయినా ఈ అమ్మడు బిగ్‌బాస్‌తో లైమ్ లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్నఅషూ రెడ్డి తన పోస్ట్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సన్నబడి నాజుగ్గా తయారైన ఆమె అప్పటి తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. దీంతో ఇక అషూ రెడ్డి పోస్ట్స్‌కి, ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ మధ్య ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్య్వూతో సంచలమైన అషురెడ్డి వెండితెరపై నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో సహానటి పాత్రలు చేసిన అషు రెడ్డి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా చేస్తోంది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న అషు రెడ్డి గతంలో 'ఛల్ మోహన్ రంగ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'ఫోకస్' సినిమాలో కీలక పాత్రలు పోషించింది. అలాగే ప్రస్తుతం 'పద్మవ్యూహంలో చక్రధారి' అనే సినిమాలో పద్మ అనే పాత్ర పోషిస్తోంది అషు. ఇది ఒక మెసేజ్ ఒరియంటెడ్ మూవీ, ఇందులో అషు ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ప్రేమ పేరుతో యువత ఎలా తప్పుదోవ పడుతుంది, దానివల్ల ఎదురయ్యే అనర్థాలు నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇందులో పద్మ పాత్రలో పోషిస్తుంది అషూ. దీనితో పాటు హీరోయిన్ చాందీన్ చౌదరి లీడ్ రోల్లో వస్తున్న యేవమ్‌లో అషు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం.
ఈ హారిక ఇక మీదే
ఇది లేడీ ఒరియంటెడ్ మూవీ. ఇందులో చాందీని చౌదరి లేడీ పోలీసు ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా.. అషు రెడ్డి హారికా అనే యువతిగా కనిపించనుందట. తాజాగా 'యేవమ్'లో తన రోల్‌ని పరిచయం చేస్తూ మూవీ టీం ఓ పోస్ట్ షేర్ చేసింది. 'నా బాడీ సూపర్ లగ్జరీ' అంటూ రైటప్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో అషు బోల్డ్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. దీనికి "హారిక ఇప్పుడు మొత్తం మీదే" అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ బ్లౌజ్, రెడ్ స్కట్‌లో అందాలు ఆరోబోస్తూ హాట్‌గా కనిపించింది.
View this post on Instagram
చూస్తుంటే ఈ చిత్రంలో అషు బోల్డ్ రోల్ చేస్తుందని అర్థమైపోతుంది. ప్రస్తుతం అషు యేనమ్ లుక్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలోనే కాదు వెండితెరపై అషు తన హాట్‌నెస్‌తో కుర్రకారు మతిపోగోడుతుందా? అంటూ నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో టాప్ ఇన్‌ఫ్లూయేన్సర్ అయినా అషురెడ్డికి వెండితెరపై పెద్దగా కలిసిరావడం లేదని చెప్పాలి. నటిగా ఎప్పుడో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పెద్ద గుర్తింపు పొందలేదు. దీంతో సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకుని మళ్లీ అవకాలు అందుకుంటోంది. రీఎంట్రీలో వైవిధ్యమైన కథలు,విభిన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రూవ్ చేసుకుంటోంది.
Also Read: వనపర్తి గుడిలోనే ఎందుకు నిశ్చితార్థం? - అసలు విషయం చెప్పిన అదితి