Arundhathi Nair: హీరోయిన్‌కు యాక్సిడెంట్ - ప్రాణాలను కాపాడడానికి ఆర్థిక సాయం కోరుతున్న ఫ్యామిలీ
Arundhathi Nair Accident: తమిళంలో పలు చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరుంధతి నాయర్‌కు ఇటీవల మేజర్ బైక్ యాక్సిడెంట్ జరిగింది. తన ప్రాణాలు కాపాడడం కోసం కుటుంబమంతా ఆర్థిక సాయం కోరుతోంది.
Arundhathi Nair Accident: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘సైతాన్’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అరుంధతి నాయర్. ఇటీవల తనకు ఒక మేజర్ బైక్ యాక్సిడెంట్ అయ్యిందని తమిళ సినీ పరిశ్రమలో వార్తలు వైరల్ అయ్యాయి. బైక్ యాక్సిడెంట్ అవ్వడం నిజమే కానీ దాని చుట్టూ ఎన్నో కథనాలు పుట్టుకొస్తున్నాయి. అందుకే ఈ విషయంపై అరుంధతి నాయర్ చెల్లెలు ఆరతి నాయర్ క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ యాక్సిడెంట్ సమయంలో అరుంధతితో పాటు తన అన్న కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అందరి ఆశీస్సులు కావాలి..
‘తమిళనాడు న్యూస్ పేపర్స్‌లో, టీవీల్లో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మూడు రోజుల క్రితం నా చెల్లెలు అరుంధతి నాయర్‌కు యాక్సిడెంట్ అయ్యిందని మాట నిజమే.. తనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతోంది. త్రివేండ్రంలోని అనంతపురి హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉంది’ అంటూ ఆరతి నాయర్ పోస్ట్ చేశారు. తను కోలుకోవడానికి అందరి ఆశీస్సులు కావాలని కోరింది. ప్రస్తుతం అరుంధతి.. హాస్పిటల్‌లో చాలా రోజులు ఉండాలని, దానికి ఆర్థిక సాయం కూడా కావాలని తన స్నేహితులు, సహ నటుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
View this post on Instagram
ఆర్థిక సాయం కోసం ఇబ్బందులు..
అరుంధతి ఫ్రెండ్, యాక్టర్ అయిన గోపికా అనిల్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నా స్నేహితురాలు అరుంధతికి యాక్సిడెంట్ అయ్యి ప్రస్తుతం చాలా క్రిటికల్ కండీషన్‌లో ఉంది. తను వెంటిలేటర్‌పై ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో ఆసుప్రతి ఖర్చులు భరించలేనంతగా పెరిగిపోతున్నాయి. మేము మా వల్ల అయినంత సాయం చేస్తున్నాం కానీ అవి ప్రస్తుత ఆసుపత్రి ఖర్చులకు సరిపోవడం లేదు. అందుకే మీరంతా వీలైనంత ఆర్థిక సాయం చేస్తే అది తన కుటుంబానికి సాయంగా ఉంటుంది’’ అంటూ అరుంధతి చెల్లెలు ఆరతి బ్యాంక్ అకౌంట్ వివరాలను షేర్ చేశారు గోపికా.
View this post on Instagram
సినీ జీవితం..
2014లో నటిగా ఎంట్రీ ఇచ్చిన అరుంధతి నాయర్.. 2016లో విజయ్ ఆంటోనీతో చేసిన ‘సైతాన్’తో గుర్తింపు తెచ్చుకుంది. తను చివరిగా 2023లో విడుదలయిన ‘ఆయురమ్ పోర్కాసుకాల్’తో ప్రేక్షకులను పలకరించింది. సినిమాల్లో మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌తో కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది అరుంధతి. అలాంటిది తనకు ఇలా జరగడం బాధాకరం అని పలువురు కోలీవుడ్ నటీనటులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read: 50 సెకన్ల యాడ్‌కే నయన్‌కు ఇంత భారీ పారితోషకమా? - స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్‌లో తీసుకోలేదేమో!