Prabhas: డూప్ వచ్చి చేస్తానన్నా వద్దన్నాడు - ప్రభాస్.. కాళ్లు పట్టుకొనే సీన్‌పై ఆర్టిస్ట్ చౌదరీ కామెంట్స్
Salaar: ‘సలార్’లో నటించిన ఎంతోమంది ఆర్టిస్టులలో ఎమ్ ఎస్ చౌదరీ కూడా ఒకరు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో నటించిన సీన్‌లో తన ప్రవర్తన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు చౌదరీ.
Ms Chowdhary about Prabhas: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలాకాలం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఒక సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ లభించింది. ఇక ఈ మూవీలో నటించిన ప్రతీ ఆర్టిస్ట్‌కు సమానంగా ప్రాధాన్యతను ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఎమ్ఎస్ చౌదరీ కూడా ఒకరు. ఆయన ప్రభాస్‌ను ఎదిరించే గ్యాంగ్‌లో ముఖ్య పాత్రలో కనిపించారు. ఇక సినిమాలోని ఒక సీన్‌లో ప్రభాస్ వచ్చి చౌదరీ కాళ్లను కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సీన్‌లో ప్రభాస్ ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చౌదరీ.
మైండ్ డైవర్ట్ అవుతుంది..
‘సలార్’లో నటించిన ప్రతీ ఆర్టిస్ట్‌కు కామన్‌గా ఒక ప్రశ్న ఎదురవుతోంది. ప్రభాస్‌తో ఎప్పుడైనా మాట్లాడారా అని కామన్‌గా అందరికీ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవుతోంది. అలా ఎమ్ ఎస్ చౌదరీకి కూడా ఎదురయ్యింది. దానిపై ఆయన కాస్త ఘాటుగా స్పందించారు. ‘‘ప్రతీ ఆర్టిస్ట్, ప్రతీ టెక్నీషియన్ వెళ్లి ఆయనతో మాట్లాడి, ముచ్చట్లు పెడదాము అన్నట్టుగా ఉంటే వాళ్లకు సిగ్గుగా ఉంటుంది. వాళ్ల మైండ్ డైవర్ట్ అవుతుంది. అందుకే నేను లొకేషన్‌లో ఎవ్వరినీ ఎక్కువగా పలకరించను. కాంబినేషన్‌లో చేసేటప్పుడు మాత్రమే హాయ్ సార్ అంటాను’’ అంటూ నటీనటులతో మాట్లాడే విధానం గురించి బయటపెట్టారు ఎమ్ ఎస్ చౌదరీ. ఆ తర్వాత ప్రభాస్.. తన కాళ్లను పట్టుకునే సీన్ గురించి మాట్లాడారు.
ఆరోగ్యకరమైన వాతావరణం..
‘‘ప్రభాస్ చిన్నపిల్లోడిలాగా పలకరిస్తాడు. పాన్ ఇండియా హీరో అని లొకేషన్‌లో బిల్డప్ ఏమీ ఉండదు. సరదాగా ఉంటారు. చిన్నపిల్లాడిలాగా పక్కన కూర్చొని షాట్ అప్పుడు మాత్రమే ముందుకు వస్తాడు. అలా ఒక ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంది. కాళ్లు పట్టుకునే సీన్‌లో రెండు, మూడు యాంగిల్స్‌లో చేశారు. రెండోసారో, మూడోసారో డూప్ వచ్చి నేను చేస్తానన్నా కూడా ప్రభాస్ వద్దన్నాడు. వద్దు నేనే చేస్తాను అన్నారు. అది చూసిన తర్వాత ప్రభాస్ రాజు కదా.. రాజులాగానే ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను. మంచోడు అనిపించింది’’ అంటూ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడారు ఎమ్ ఎస్ చౌదరీ.
ఫైనల్‌గా ‘సలార్’తో హిట్..
‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఏవీ ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయాయి. దాని తర్వాత వచ్చిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌గా నిలిచాయి. దీంతో ప్రభాస్ స్టోరీ సెలక్షన్‌పై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఫైనల్‌గా ప్రశాంత్ నీల్‌తో సినిమా అంటే ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ‘కేజీఎఫ్’తో యశ్‌ను రాకీ భాయ్‌గా నిలబెట్టిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మూవీ నుండి ఒక్కొక్కటి అప్డేట్స్ విడుదల అవుతున్నప్పుడు ‘సలార్’పై భారీగా అంచనాలు పెంచేసుకున్నారు. ఇక ఫ్యాన్స్ అంచనాలను టచ్ చేస్తూ ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇందులో ప్రభాస్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, శృతి హాసన్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: అందుకే ఆ బంధాన్ని ముగించేశాను, అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లొస్తాయి - విడాకులపై నిహారిక కామెంట్స్