అన్వేషించండి

Niharika Konidela: అందుకే ఆ బంధాన్ని ముగించేశాను, అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లొస్తాయి - విడాకులపై నిహారిక కామెంట్స్

Niharika Konidela Divorce: మెగా ఫ్యామిలీలో పుట్టిన నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నిరోజుల్లోనే విడాకులు తీసుకుంది. దీనిపై తొలిసారి తను స్పందించింది.

Niharika Konidela about Divorce: గత రెండు, మూడేళ్లలో టాలీవుడ్‌ జంటల మధ్య జరిగిన విడాకులు సెన్సేషన్‌గా మారాయి. అందులో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల విడాకులు కూడా ఒకటి. చైతన్య జొన్నలగడ్డను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిహారిక. వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరిగింది. కానీ పెళ్లయిన ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో కూడా చైతన్య ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఫైనల్‌గా విడాకుల గురించి వీరిద్దరూ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇక ఇన్నాళ్ల తర్వాత తన విడాకుల విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది నిహారిక.

ఎవరినీ ఈజీగా నమ్మకూడదు..

తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది నిహారిక కొణిదెల. అందులో తన పెళ్లి బంధం ఏడాదిలోనే ముగిసిపోతుందని అనుకోలేదంటూ తన పెళ్లి, విడాకుల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. పెళ్లి మిగిల్చిన బాధ వల్ల ఎవరినీ ఈజీగా నమ్మకూడదని తెలుసుకున్నానని చెప్పింది. విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్టు కాదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎదుటివారిని ఈజీగా నమ్మకూడదన్న విషయం పెళ్లి తర్వాతే తెలుసుకున్నానని, దానిని ఒక పాఠంగా భావించి ముందుకు సాగడం అలవాటు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అవన్నీ గుర్తొస్తే తనకు కన్నీళ్లు వస్తాయని ఎమోషనల్‌గా మాట్లాడింది. 

ట్రోల్స్‌పై నిహారిక స్పందన..

ఇక పెళ్లయిన ఏడాదిలోనే విడాకులు తీసుకోవడంపై నిహారికపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం ఎందుకు అంటూ చాలామంది విమర్శించారు. వాటిపై కూడా తను స్పందించింది. పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ కలిసి ఉంటామనే ఉద్దేశ్యంతోనే ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటారని, అంతే కానీ సంవత్సరంలోనే విడిపోతామని అనుకొని భారీగా ఖ‌ర్చుపెట్టి ఎవ‌రూ పెళ్లిచేసుకోర‌ని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఏ జంట అయినా ఏ అడ్డంకులు లేకుండా త‌మ రిలేష‌న్‌షిప్ సాఫీగా సాగాల‌నే కోరుకుంటారని తెలిపింది. అలా ఆలోచించే ప్రేమ, పెళ్లి అనేవాటిలో అడుగుపెడతారని.. తాను కూడా అలాగే అనుకున్నానని చెప్పింది.

అందుకే బంధాన్ని ముగించేశాను..

తాను ఊహించినట్టు ఏదీ జరగలేదని నిహారిక చెప్పుకొచ్చింది. అందుకే ఆ బంధాన్ని ముగించేశానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు తన గురించి ఏమనుకుంటారో అది మాత్రమే తనకు ముఖ్యమని, తనకు తెలియని వారు, సంబంధం లేనివారు ఏమనుకున్నా తాను పట్టించుకోనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక గత రెండేళ్లలో ఫ్యామిలీ విలువను బాగా అర్థం చేసుకున్నానని బయటపెట్టింది నిహారిక. తనను ఒక భారంగా తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ భావించలేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటోంది ఈ మెగా ప్రిన్సెస్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నాయని రివీల్ చేసింది. ఇప్పటికే ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా బిజీ అయ్యింది నిహారిక.

Also Read: చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల చిన్నారి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Embed widget