అన్వేషించండి

Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత

AP High Court on Actor Mohan Babu | విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని నటుడు మోహన్ బాబు మద్యంతర పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

అమరావతి: సినీ నటుడు, మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని మోహన్ బాబు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక సమాచారాన్ని అందించారు. కిడ్నాప్ ఘటనకు ముందు, తర్వాత యూనివర్సిటీ పీఆర్వో (PRO) సతీష్‌తో నటుడు మోహన్ బాబు నిరంతరం ఫోన్లో మాట్లాడారని, వారి మధ్య మెసేజ్‌లు కూడా మారాయని పోలీసులు ఆధారాలను చూపిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కేసుకు సంబంధించిన మెయిన్ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో  విచారణ జరపాల్సి ఉందన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.

అసలు వివాదం ఏంటీ.. ఏం జరిగింది..
మోహన్ బాబు యూనివర్సిటీ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఫీజుల విషయంలో గతంలోనూ కోర్టు వరకు విషయం వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో ఎంబీయూలో ఫీజుల పెంపు, ఇతర విద్యార్థి సమస్యలపై నిరసన తెలిపిన విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కావడం వివాదానికి దారితీసింది. 

మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన కొందరు విద్యార్థి సంఘం నాయకులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఇందులో మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్వో సతీష్ పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే, దర్యాప్తు లోతుగా సాగగా, ఈ మొత్తం వ్యవహారంలో ఛాన్సలర్ మోహన్ బాబు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కిడ్నాప్ జరిగిన సమయంలో మోహన్ బాబు, పీఆర్వో సతీష్ మధ్య జరిగిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌ మెస్సేజ్‌లను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాల ప్రకారమే మోహన్ బాబును కేసులో నిందితుడిగా చేర్చి, చర్యలు తీసుకునేంకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 

తనపై కొందరు కక్షపూరితంగా కేసు పెట్టారని, అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని నటుడు మోహన్ బాబు ఏపీ కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. కానీ పోలీసుల వాదన, వారు చెప్పిన విషయాలతో ఏకీభవించిన కోర్టు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు తీసుకోకూడదన్న పిటిషన్‌ను కొట్టివేసింది. కేసు పూర్తి స్థాయి విచారణ జరగాలని భావించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మార్చి 3కి వాయిదా వేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget