News
News
వీడియోలు ఆటలు
X

Anveshi teaser: ‘అన్వేషి’ టీజర్: అనన్య నాగళ్ల కీలక పాత్రలో మిస్టరీ థ్రిల్లర్‌ - ఆ అడవిలో ఏమైంది?

అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా 'అన్వేషి' మూవీ టీజర్ ను లాంచ్ చేసారు. విజయ్ ధరన్, సిమ్రాన్ గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ లో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో కనిపించింది.

FOLLOW US: 
Share:
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో, వర్థమాన దర్శక రచయితలు వైవిధ్యమైన కథలతో వస్తున్నారు. ప్రేక్షకులని అలరించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'అన్వేషి' అనే స్మాల్ బడ్జెట్ సినిమా ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
 
'అన్వేషి' సినిమాలో విజయ్ ధరన్, సిమ్రాన్ గుప్తా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'మల్లేశం' 'వకీల్ సామ్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇదొక సస్పెన్స్ & మిస్టరీ థ్రిల్లర్ అని హామీ ఇచ్చారు. అలానే సినిమాలోని 'ఏదో ఒక కలవరం' అనే పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో వరల్డ్ లేబర్ డే సందర్భంగా ఈరోజు సోమవారం టీజర్ ను లాంచ్ చేసారు.
 
చిన్న సినిమాలకి ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలిచే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు.. తాజాగా 'అన్వేషి' చిత్ర టీజర్ ను విడుదల చేసారు. టీమ్ మొత్తానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు. 'సస్పెన్స్ మరియు మిస్టరీతో నిండిన ప్రపంచాన్ని అన్వేషించడానికి మీరు ఎగ్జైటింగ్ గా ఉన్నారా? అయితే ఇది మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చో బెట్టే రోలర్ కోస్టర్ రైడ్ లో ఒక చిన్న గ్లిమ్స్' అని మేకర్స్ టీజర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేశారు. 
 
''నాకు డిటెక్టివ్ అవ్వాలని ఉంది సార్" అని అని హీరో చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇందులో విజయ్ ధరన్ డిటెక్టివ్ నవలలు చదువుతూ, తన పరిధిలోకి వచ్చిన కేసులను పరిశోధిస్తూ కనిపించాడు. అయితే అతను తొలి చూపులోనే సిమ్రాన్ గుప్తాతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. 
 
'ఏంటి, మీ అబ్బాయిలు.. ఇలా పరిచయం అవ్వగానే, అలా కాఫీ షాప్ కి వెళ్దాం అంటారు' అని హీరోయిన్ అంటుండగా.. 'కాఫీలో కెఫీన్ అనే మత్తు పదార్థంతో పాటుగా ఇద్దరు వ్యక్తులను కలిపే విశేషం ఉందంట' హీరో చెప్పడం ఆకట్టుకుంటుంది. మరోవైపు అనన్య నాగెళ్ళ ఒక మెడికల్ స్టూడెంట్ గా కనిపించింది. 
 
ఇదిలా ఉంటే విజయ్ ఒక రోజు నైట్ తన ఫ్రెండ్ తో కలిసి మారేడు కోన అనే ప్రాంతానికి బయలు దేరుతాడు. రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళడం మంచిది కాదని హెచ్చరించినా వినకుండా వెళ్ళిన వారికి, కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనట్లు టీజర్ లో చూపించారు. అలానే మూడ నమ్మకాలను విశ్వసించే ఆ ఊరి జనాలు, అక్కడ ఒక దెయ్యం ఉందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గ్రామంలో ఏమి జరుగుతుందనేది తెలుసుకోడానికి విజయ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ అన్వేషణలో అతనికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి? మిస్టరీ కేసుని చేదించాడా లేదా? ఆ ఊరిలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి అనన్యకు సంబంధం ఏంటి? అసలు అక్కడ ఏమి జరుగుతోంది? అనేది తెలియాలంటే 'అన్వేషి' సినిమా చూడాలి.
 
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో అజయ్ ఘోష్, జబర్దస్త్ నాగి, రచ్చ రవి, ప్రభు, సత్య శ్రీ, సూర్య తేజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. టీజర్ లో అనన్యకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ.. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుందని హింట్ ఇచ్చారు. బ్యాగ్రాండ్ స్కోర్, విజువల్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. 
 
'అన్వేషి' చిత్రానికి వీజే ఖన్నా దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. మేకర్స్ త్వరలోనే ట్రైలర్ ను లాంచ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Published at : 01 May 2023 01:38 PM (IST) Tags: Ananya Nagalla Anveshi Anveshi Movie Teaser Mystery Thiller Vijay Dharan

సంబంధిత కథనాలు

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి