Anushka Shetty: నెక్స్ట్ ఇయర్ నుంచి వరుసగా మూవీస్ చేస్తా బ్రో - రానాతో స్వీటీ అనుష్క ఫోన్ కాల్... ఏంటీ నీకు పెళ్లా?
Anushka Rana: 'ఘాటి' ప్రమోషన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. స్వీటీ అనుష్క ఆఫ్ స్క్రీన్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా... తాజాగా రానాతో ఫోన్ కాల్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Anushka Shetty Rana Daggubati Phone Call Leaked: స్టార్ హీరోయిన్ అనుష్క డిఫరెంట్ స్టోరీ 'ఘాటి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవర్ ఫుల్ వారియర్‌గా స్వీటీ కనిపించనున్నారు. ఈ నెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ప్రమోషన్స్‌లో అనుష్క ఆఫ్ స్క్రీన్‌లో పాల్గొంటున్నారు. తాజాగా... అనుష్కను హీరో రానా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
డిఫరెంట్ స్టోరీ... డిఫరెంట్ రోల్
అరుంధతి, బాహుబలి మూవీస్ తర్వాత అంతటి స్థాయిలో ఈ 'ఘాటి' మూవీ నిలుస్తుందని రానాతో చెప్పారు అనుష్క. దీనికి ఆయన రియాక్ట్ అవుతూ... 'ఇలాంటి రోల్, ఇలాంటి కథకు నిన్ను తప్పితే ఇంకెవరిని పెడతారు. వాళ్లకు వేరే ఆప్షన్స్ ఉండవు కదా.' అంటూ ఫన్ చేశారు రానా. 'ఈ మూవీలో నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చేమో. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లోనే మూవీ షూటింగ్ జరిగింది. ఇందులో వయలెన్స్ పక్కన పెడితే... ఇప్పటి సమాజంలో పరిస్థితులకు ఈ స్టోరీ సరిగ్గా సరిపోతుంది. క్రిష్ నాకెప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు.
'వేదం'లో సరోజ కూడా చాలా సెన్సిటివ్ రోల్. దాన్ని ఆయన గొప్పగా చూపించారు. నా కెరీర్‌లోనే ఆ పాత్ర గుర్తుండిపోతుంది. ఇప్పుడు 'ఘాటీ'లో 'షీలావతి' పాత్ర కూడా అలాంటి గుర్తింపునే ఇస్తుంది. ఘాటి ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన ప్రజలు. అందులో ఉండే దేశీరాజు, షీలా వారి జీవితం. అక్కడ జరిగే అక్రమాల వల్ల ఈ వర్గ ప్రజలకు జరిగిన ఇబ్బందులు. వాటన్నింటినీ ఎదుర్కొని ఓ సాధారణ అమ్మాయి ఎలా యోధురాలిగా మారింది?, వారికి ఎలా అండగా నిలబడింది అనేదే స్టోరీ బ్యాక్ డ్రాప్.' అంటూ స్వీటీ చెప్పారు.
View this post on Instagram
వరుసగా మూవీస్ చేస్తా బ్రో
'ఇలానే మూడేళ్లకు ఓసారి సినిమా చేస్తావా? నిన్ను కలిసి పదేళ్లు అవుతుంది.' అని రానా అడగ్గా... ఇకపై వచ్చే ఏడాది నుంచి వరుసగా సినిమాలు చేస్తా అంటూ స్వీటీ నవ్వుతూ బదులిచ్చారు. 'సెలెక్టెడ్‌గా మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాను. వచ్చే ఏడాది నుంచి వరుసగా మూవీస్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కువ మూవీస్‌లో నన్ను చూస్తారు.' అని చెప్పారు.
ఏంటీ నీకు పెళ్లా?
వచ్చే ఏడాది నుంచి అందరి ముందుకు వస్తానని... వరుసగా మూవీస్ చేస్తానని చెప్పారు అనుష్క. 'మా ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు కూడా వెళ్లడం లేదు. అందరూ ఎప్పుడు కనిపిస్తావ్ అని అడుగుతున్నారు. త్వరలోనే కనిపిస్తాను.' అంటూ స్వీటీ చెప్పగా... 'ఏంటీ నీకు పెళ్లా' అంటూ ఫన్ చేశారు రానా. 'అలాంటిదేమీ లేదు. ఇళ్లల్లో పెళ్లి గురించి నేను చెబుతున్నా' అంటూ నవ్వులు పూయించారు అనుష్క.






















