Anushka Prabhas : ప్రభాస్‌తో మళ్ళీ సినిమా ఎప్పుడు? - అనుష్క ఏం చెప్పిందో తెలుసా?
వెండితెరపై ప్రభాస్, అనుష్కలది సూపర్ హిట్ జోడీ. నిజ జీవితంలోనూ వారి మధ్య మంచి స్నేహం ఉంది. మళ్ళీ వాళ్ళిద్దరూ సినిమా చేసేది ఎప్పుడు? ఈ ప్రశ్నకు అనుష్క ఏం సమాధానం చెప్పారో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty)లది సూపర్ డూపర్ హిట్ జోడీ. వాళ్ళిద్దరూ 'బిల్లా'లో మొదటి సారి జంటగా నటించారు. స్క్రీన్ మీద అనుష్క బికినీలో కనిపించిన మొదటి సినిమా కూడా అదే. బాక్సాఫీస్ బరిలో 'బిల్లా' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ప్రభాస్ - అనుష్క జోడీకి మంచి పేరు వచ్చింది.
'మిర్చి' తర్వాత 'మిర్చి', 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది కన్‌క్లూజన్' చిత్రాలతో అనుష్క, ప్రభాస్ భారీ విజయాలు అందుకున్నారు. వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరి మధ్య మంచి స్నేహం ఉంది. కొంత మంది వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా అనుకున్నారు. ఇద్దరికీ పెళ్లి కాకపోవడం, స్క్రీన్ మీద కెమిస్ట్రీ కుదరడం కూడా అందుకు కారణం అనుకోవచ్చు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి సినిమాలకు వస్తే... మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించేది ఎప్పుడు? ఈ ప్రశ్నకు అనుష్క ఏం సమాధానం చెప్పారో తెలుసా?
నేనూ కోరుకుంటున్నాను - అనుష్క
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మరికొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో అనుష్క శెట్టి ముచ్చటించారు. అప్పుడు 'మీరు మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో లేదా ప్రభాస్ జోడీగా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు' అని ప్రశ్నించగా... ''నేనూ కోరుకుంటున్నాను. కాంబినేషన్ కుదిరేలా చూడండి. మంచి కథ కుదిరితే తప్పకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం'' అని అనుష్క తెలిపారు. అదీ సంగతి!
Also Read : పెళ్ళికి అనుష్క రెడీ! కానీ, ఓ కండిషన్ - అదేమిటో తెలుసా?
పదిహేనేళ్లుగా ప్రభాస్ మారలేదు
ప్రభాస్ గురించి అనుష్క మాట్లాడుతూ ''సుమారు పదిహేనేళ్లుగా నాకు ప్రభాస్ తెలుసు. అప్పుడు ఎలా ఉన్నాడో... ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అతనిలో ఎటువంటి మార్పు లేదు. మా మధ్య మంచి స్నేహం ఉంది. మంచి కథ వస్తే అతనితో నటించడానికి నేను రెడీ. ఆ కథ కోసం నేనూ ఎదురు చూస్తున్నా'' అని చెప్పారు.
Also Read : విజయ్ దేవరకొండ మీద బురదజల్లే ప్రయత్నమా? మహేష్, రవితేజను ఇలా అడగగలరా?
ఐదేళ్ళ తర్వాత వెండితెరపైకి అనుష్క!
'మిస్ శెట్టి మిస్టర్ శెట్టి' స్పెషాలిటీ ఏమిటంటే... ఐదేళ్ళ తర్వాత వెండితెరపై అనుష్క సందడి చేయనున్న సినిమా ఇది. 'భాగమతి' తర్వాత ఆమె నాయికగా నటించిన సినిమాలు ఏవీ థియేటర్లలో విడుదల కాలేదు. ఓటీటీల్లో వచ్చాయి. ఆ మధ్య చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో అతిథి పాత్ర చేశారు. ఆ గ్యాప్ తాను కావాలని తీసుకున్నదే అని అనుష్క తెలిపారు.
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. మహేష్ బాబు .పి దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు ఈ సినిమా చిరంజీవి ప్రశంసలు అందుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial