Anupama Parameswaran: రామ్ పోతినేనితో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి, ఆమె తల్లి రియాక్షన్ ఇదే!
అనుపమ పరమేశ్వరన్, రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ తల్లి రియాక్ట్ అయ్యింది.
సినిమా తారల వ్యక్తిగత జీవితాల మీద ప్రేక్షకులకు చాలా ఆసక్తి ఉంటుంది. వారికి సంబంధించిన సరికొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. స్కూల్ డేస్ ముచ్చట్లు, కాలేజీ డేస్ ప్రేమకథలు, ప్రేమలు, పెటాకులు, ఒకటేమిటీ అన్నింటిపైకా ఓ కన్నేసి ఉంచుతారు. కొంత మంది అయితే, ఆ హీరోయిన్ ఈ హీరోతో ప్రేమలో ఉంది. ఈ హీరో ఆ బ్యూటీని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. ఆయా హీరో, హీరోయిన్లు ఏ సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే విషయాల మీద ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటమే కాకుండా, వారి మీద లేనిపోని పుకార్లు పుట్టించి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో అలాంటి రూమర్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రామ్ తో ప్రేమలో అనుపమ
అందాల తార అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో రామ్ పోతినేనితో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘ఉన్నది ఒకటే జిందగీ’. మరొకటి ‘హలో గురూ ప్రేమ కోసమే’. రెండో సినిమా చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందట. అదికాస్త ప్రేమగా మారిందట. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఒకే చెప్పడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. ఇదీ తాజా గాసిప్ సారాంశం.
అనుపమ తల్లి ఏమన్నారంటే?
ఈ వార్తలు గత కొద్ది కాలంగా వస్తున్నా, ఇటు అనుపమ గానీ, అటు రామ్ గానీ స్పందించలేదు. ఎవరూ మాట్లాడకపోవడంతో గాసిప్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏదో తోస్తే అది రాసేస్తున్నారు. అయితే, ఈ రూమర్లు అనుపమ తల్లి సునీతకి తెగ చికాకు పుట్టిస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే అనుమప ప్రేమకథ గురించి స్పందించారట. రామ్ తో తమ అమ్మాయి ప్రేమలో లేదని తేల్చి చెప్పిందట. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేని కొట్టిపారేసిందట. వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా వార్తలు రాయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసిందట.
రామ్, అనుపమ సినిమా గురించి..
రామ్ పోతినేని తాజాగా ‘స్కంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. త్వరలో ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ చేయబోతున్నారు. అటు అనుపమ తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. రవితేజతో ‘ఈగిల్’, సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు స్వైర్’ సినిమాల్లో నటిస్తోంది. ‘సినిమా బండి’ దర్శకుడు ప్రవీణ్ తోనూ ఓ సినిమా చేస్తోంది. తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది.
Read Also: నటుడు విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు, సెన్సార్ బోర్డు అధికారులు సహా పలువురిపై నేరాభియోగాలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial