అన్వేషించండి

Actor vishal: నటుడు విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు, సెన్సార్ బోర్డు అధికారులు సహా పలువురిపై నేరాభియోగాలు

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ ఆరోపణలపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు అధికారులతో పాటు పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసింది.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం కేంద్రం సెన్సార్ బోర్టు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లంచం అడిగారంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) ఆఫీస్ లో తనకు స్వయంగా ఈ అనుభవం ఎదురయిందన్నారు. సినిమా సర్టిఫికేషన్ కు లంచం తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ లంచం వ్యవహారాన్ని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

విశాల్  ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ

సెన్సార్ బోర్డు సభ్యులకు లంచం ఇచ్చినట్లు చేసిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతోపాటు పలువురు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికారులపై కేసు ఫైల్ చేసింది. త్వరలోనే వారిని విచారించనున్నట్లు తెలిపింది.

వీడియోలో విశాల్ ఏం చెప్పారంటే?

"వెండితెరపై  అవినీతి చూపించడం కామన్. నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. కానీ, నేను తొలిసారి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సి వచ్చింది.  ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని CBFC(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్‌ సర్టిఫికేషన్) ఆఫీస్ లో ఇంకా దారుణం అవినీతి జరుగుతోంది. నా సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేనే స్వయంగా రెండుసార్లు లంచం ఇచ్చాను.  నా సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇలా చేస్తుంది నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ వీడియోలో వెల్లడించారు.

స్పందించిన కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ

విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. “CBFCలో సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం అడగడం అత్యంత దారుణం. విశాల్ కు ఎదురైన ఘటన నిజంగా  అత్యంత దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు.  ఈ లంచం వ్యవహారం వెనుక ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని వెల్లడించింది.   

‘మార్క్ ఆంటోనీ’ సినిమా గురించి..   

ఇక అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన  'మార్క్ అంటోనీ' చిత్రం టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. విశాల్, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 విడుదలై తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత అందించారు.  

Read Also: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Emotional Drama OTT : ఈ లెక్కల మాస్టారు ఓ ఇన్‌స్పిరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రామ్మూర్తి మాస్టారు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ లెక్కల మాస్టారు ఓ ఇన్‌స్పిరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రామ్మూర్తి మాస్టారు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Update : వారణాసి... ఆ 40 రోజుల వెనుక కథ - దర్శక ధీరుడు రాజమౌళి చెప్పిన సీక్రెట్
వారణాసి... ఆ 40 రోజుల వెనుక కథ - దర్శక ధీరుడు రాజమౌళి చెప్పిన సీక్రెట్
Meghasandesam Serial Today October 25th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  కోర్టుకు వచ్చిన శరత్‌ చంద్ర – డమ్మీ కోర్టు అని నమ్మిన సూర్య, అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌:  కోర్టుకు వచ్చిన శరత్‌ చంద్ర – డమ్మీ కోర్టు అని నమ్మిన సూర్య, అపూర్వ
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్

వీడియోలు

Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget