By: ABP Desam | Updated at : 20 Apr 2022 11:21 AM (IST)
నజ్రియా నజీమ్, నాని
క్రిస్టియన్ అమ్మాయితో బ్రాహ్మణ యువకుడు ప్రేమలో పడితే? ఈ కథాంశంతో రూపొందిన సినిమా 'అంటే సుందరానికి' (Ante Sundaraniki Movie). ఇందులో నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించారు. సినిమాలో అతని క్యారెక్టర్ పేరు సుందర్. నానికి జంటగా నజ్రియా నజీమ్ (Nazriya Nazim Fahadh) నటించారు. ఆమె పాత్ర పేరు లీల. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మించిన చిత్రమిది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
Ante Sundaraniki Movie Teaser Out Now: 'అంటే సుందరానికి' సినిమా టీజర్ చూస్తే... రొమాన్స్ అండ్ కామెడీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉన్నాయి. సుందర్ ప్రసాద్‌ది సనాతన ఆచార వ్యవహారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబం. లీలాది క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇంట్లో ఆచారాల వల్ల సుందర్ ఎదుర్కొనే పరిస్థితులు నవ్వించాయి. టీజర్‌లో సీన్స్ బావున్నాయి. 'ఏంటి నవ్వావా? ఇంకొంచెం నవ్వితే ఇటువైపు లైట్లు అన్నీ ఆర్పేస్తారు. మావాడికి కూడా కరెంట్ సేవ్ అవుతుంది' అంటూ హీరోయిన్‌తో సుందర్ రొమాన్స్‌నూ టీజర్‌లో చూపించారు. వీళ్ళిద్దరి ప్రేమ, పెళ్ళికి కులాలు అడ్డు కాదని, ఇంకేదో సమస్య ఉందంటూ సస్పెన్స్‌లో ఉంచారు. సినిమాపై ఆసక్తి పెంచారు.
Experience the Glimpse of Love, Laughter and Families of Sundar & Leela ♥️#AnteSundaranikiTeaser - https://t.co/TM7tuIHSBe#AhaSundaraTeaser - https://t.co/p1zKF5rp3L#AdadeSundaraTeaser - https://t.co/d5t0l6myoi
Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/96bGbabNjT— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2022
Also Read: తమన్నా, మెహరీన్ గ్లామర్ షో హైలైట్‌గా 'ఊ ఆ ఆహా ఆహా'
తెలుగులో 'అంటే సుందరానికి' పేరుతో, తమిళంలో 'ఆదదే సుందర' (Adade Sundara Tamil movie Teaser Out Now)గా, మలయాళంలో 'ఆహా సుందర' (Aha Sundara Malayalam movie Teaser Out Now)గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జూన్ 10న సినిమా విడుదల కానుంది (Ante Sundaraniki movie to hit the screens on June 10th). ఈ చిత్రానికి వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం అందించారు.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు