అన్వేషించండి
Raviteja: రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎంట్రీ
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నట్లు సమాచారం. అతడి పేరు మాధవ్ భూపతిరాజు.

రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎంట్రీ
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా నిలదొక్కుకున్నారు రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన రవితేజ.. ఆ తరువాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నారు. తన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ తరువాత మాస్ మహారాజాగా ఎదిగారు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరువాత తన ఇద్దరు తమ్ముళ్లు భరత్, రఘులను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.
కానీ రవితేజ రేంజ్ లో వారు జనాలను ఆకట్టుకోలేకపోయారు. త్వరలోనే రవితేజ కుమారుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మహాధన్ తన తండ్రితో కలిసి ఓ సినిమాలో కూడా నటించాడు. ఇదిలా ఉండగా.. మహాధన్ కంటే ముందుగానే రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నట్లు సమాచారం. అతడి పేరు మాధవ్ భూపతిరాజు. రవితేజ తమ్ముడు రఘు తనయుడే మాధవ్.
అతడి వయసు 21 సంవత్సరాలు. నటుడిగా ఇండస్ట్రీలో రాణించాలని ఆశిస్తున్నాడు మాధవ్. దానికి తగ్గట్లుగానే నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారాలని చూస్తున్నాడు. ఓ లవ్ స్టోరీతో అతడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాధవ్ డెబ్యూ ఫిల్మ్ కి సంబంధించిన బాధ్యతలు రవితేజ తీసుకున్నారని సమాచారం. ఆయనకే కథ కూడా ఓకే చేశారట. మరి కొద్దిరోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన రాబోతుంది!
View this post on Instagram
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















