Music Directors Remuneration: అనిరుధ్ ఎఫెక్ట్ - రెమ్యునరేషన్లు పెంచేసిన సంగీత దర్శకులు, నిర్మాతలకు ఒకటే మ్యూజిక్కు!
Remuneration: సినిమా హీరోల రెమ్యునరేషన్లు తెలుసు, హీరోయిన్లు ఎంత డిమాండ్ చేస్తారో తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కోట్లలో డిమాండ్ చేస్తున్నారట. ఈ మధ్య వాళ్ల రెమ్యునరేషన్ పెంచేశారట కూడ.
Music Directors Remuneration Hike: ఇండస్ట్రీలో అందరి రెమ్యునరేషన్‌ల గురించి లీక్ అవుతూనే ఉంటాయి. కానీ, ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ గురించి మాత్రం చర్చకు రాలేదు. అయితే, ఇప్పుడు వాళ్లు కోట్ చేసే రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ల వాళ్ల రెమ్యునరేషన్లు పెంచేశారట. కారణం.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వల్లేనట. అనిరుధ్ రెమ్యునరేషన్ విషయంలో తగ్గడని, చాలా కాస్ట్‌లీ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం మిగతా వాళ్లపై కూడా పడుతున్నట్లు చెప్తున్నారు.
నెం.1 మ్యూజిక్ డైరెక్టర్..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు అనిరుధ్. ఆయన చేసిన ప్రతి సినిమాలోని మ్యూజిక్ సూపర్ హిట్. ఈ మధ్యే అనిరుధ్ చేసిన 'జవాన్' సినిమా పాటలు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్. అయితే, ఆయన రెమ్యునరేషన్ తెగ పెంచేశాడట. సినిమా రేంజ్, దాంట్లో ఉన్న స్టార్స్ ని బట్టి.. అనిరుధ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. దాదాపు ఒక్కో సినిమాకి రూ.12 కోట్లు తీసుకుంటాడని చెప్తున్నారు. సినిమా రేంజ్‌ను బట్టి రూ.10 కోట్లకు తగ్గించుకుంటాడట అనిరుధ్. ఏదేమైనా రూ.8 కోట్ల కంటే తక్కువగా మాత్రం రెమ్యునరేషన్ ఉండదట అనిరుధ్‌కు.
ఏ ఆర్ రెహ్మాన్ ఎంతంటే?
ఈ మధ్యకాలంలో వచ్చిన అనిరుధ్.. మినిమమ్ రూ.8 కోట్లు వసూలు చేస్తుంటే.. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పాతుకుపోయిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు తగ్గుతారు. వాళ్లు కూడా బాగానే కోట్ చేస్తున్నారట. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్.. ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు వసూలు చేస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న 'ఆర్సీ 16' సినిమాకి రెహ్మాన్ రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
'పుష్ప' తర్వాత పెంచేసిన దేవీ..
తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు దేవీ శ్రీ ప్రసాద్. కెరీర్ మొదట్లో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన దేవి ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప తో ఆయన రేంజ్ పెరిగిపోయింది. 'పుష్ప' సూపర్ హిట్ తో దేవీ కూడా రెమ్యునరేషన్ పెంచేశాడట. ఇప్పుడు ఆయన కూడా మినిమమ్.. రూ.8 కోట్లు లేనిదే ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదని అంటున్నాయి సినీ వర్గాలు.
ఎంఎం కీరవాణి కూడా..
ఎన్నో మెలోడియస్, హిట్ పాటలు అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు ఎం ఎం కీరవాణి. ఆయన కూడా తన రెమ్యునరేషన్‌ను అమాంతంగా పెంచేశారట. ఇక ఈ మధ్య కాలంలో ఆస్కార్ కూడా రావడంతో కీరవాణి రేంజ్ పెరిగిందనే చెప్పాలి.
సినిమా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో మ్యూజిక్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, మ్యూజిక్ డైరెక్టర్లకు అంత ప్రిఫరెన్స్ ఉంటుంది. అలా సినిమా హిట్ అయితే.. హీరో, హీరోలు రెమ్యునరేషన్ పెంచితే.. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అదే బాట పడుతున్నారు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏదేమైనా.. అనిరుధ్ దీనికి కారణం అని అంటున్నారు.